గులాబ్ తుఫాన్ బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది…

-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
-సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి

పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
గులాబ్ తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. సోమవారం పలాస కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర మంత్రి డాక్టర్ అప్పలరాజుతో పాటు నియోజకవర్గం లోని మూడు మండలలాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచినీళ్ళపేట మత్స్యకారులు సముద్రంలో గల్లంతు అయిన విషయం స్వయంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా గులాబ్ తుఫాన్ కారణంగా ఏర్పడిన ఇబ్బందులు ఎదురైన సమస్యలు చర్చించారు. తుఫాన్ ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గులాబ్ తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుందని. తుఫాన్ కారణంగా ఎవరైనా మృతి చెందతే వారికి తక్షణ చర్యలు క్రింద 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా అందిస్తామని అన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *