-క్యాంపు కార్యాలయంలో గుర్రం జాషువా చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళి..
-నివాళి అర్పించిన మంత్రి తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక ప్రయోజనం ఆశించి తన రచనలు ద్వారా చైతన్యం తీసుకుని వొచ్చిన ఆధునిక కవి గుర్రం జాషువా అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ చీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందిన వ్యక్తి గుర్రం జాషువా అన్నారు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినా తాన పదునైన రచనలతో సామాజిక మార్పుకోసం కృషి చేసారు. అణగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం పాటుబడిన నవయుగ కవి చక్రవర్తి మహోన్నత వ్యక్తిత్వం గుర్రం జాషువా వారిదని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వి. శ్రీనివాస రావు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.