రిజిస్ట్రేషన్ మేళాను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ప్రతీ పేదవానికి హక్కుతో కూడిన ఇంటి పట్టా ఉండాలనేదే జగనన్న లక్ష్యం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేదవానికి హక్కుతో కూడిన ఇంటి పట్టా ఉండాలనేదే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. వాంబే కాలనీలోని కమ్యూనిటీ హాల్లో వీఎంసీ, టౌన్ ప్లానింగ్ మరియు గృహ నిర్మాణ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ మేళాను రెండో రోజు వైఎస్సార్ సీపీ డివిజన్ కో ఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యకు ఈ కార్యక్రమం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఇందులో చాలా వరకు గతంలో ఒకరి పేరుతో మంజూరైన ఇళ్ల పట్టాలను.. తర్వాత కొన్న వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయవలసి ఉందన్నారు. అపార్ట్ మెంట్లలోనూ బ్యాంకు లోన్ ఒకరి పేరిట ఉంటే.. ఫ్లాట్ ఇంకొకరి పేరిట చూపుతున్నాయన్నారు. ఇటువంటి సమస్యల శాశ్వత పరిష్కారానికి 3 రోజుల పాటు రిజిస్ట్రేషన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అధికారులు సూచించినట్లు లబ్ధిదారులు సంబంధిత డాక్యుమెంట్లతో అప్లికేషన్లు సకాలంలో సమర్పించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు 15 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు ప్రజల నుంచి దాదాపు 1000 వరకు దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. అర్జీలు స్వీకరించిన అనంతరం సంబంధిత అధికారులు వీటిపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన వారందరికీ శాశ్వత పట్టా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రజల సౌకర్యాన్ని బట్టి అవసరమైతే కార్యక్రమాన్ని పొడిగిస్తామని తెలియజేశారు. మరోవైపు వివిధ ప్రభుత్వాల హయాంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్‌ వద్ద నుంచి లోన్లు తీసుకున్న పేద వర్గాలకు వన్ టైమ్ సెటిల్‌మెంట్‌కు ఇటీవల ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మల్లాది విష్ణు  అన్నారు. దీని ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలో లోన్లు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్న 3,144 మంది లబ్ధిదారులకు వన్ టైం సెటిల్మెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో బిల్డింగ్ ఇన్స్ పెక్టర్లు బేగ్, గిరి, కొండలరావు, అసిస్టెంట్ సిటిప్లానర్ ఇంఛార్జి టీ.పీ.ఓ లక్ష్మీనారాయణ, వైఎస్సార్ సీపీ నాయకులు బత్తుల దుర్గారావు, గోపి, కుమారి, రాజా, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలి

-2026లో ఎన్టీఆర్ జిల్లాలో గణనీయంగా తగ్గిన డెంగ్యూ, మలేరియా కేసులు -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజయవాడ, నేటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *