-లెటర్ ఆఫ్ క్రెడిట్(LOC) ద్వారా రూ.లక్షా 60 వేలు అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుపేద కుటుంబాలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వాంబేకాలనీకి చెందిన అధికారి గణపతి అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యం బారిన పడటంతో (నడుముకు సంబంధించిన ఆపరేషన్ నిమిత్తం) సీఎం సహాయనిధికి దరకాస్తు చేసుకోగా రూ.1 లక్షా 60 వేలు ఎల్‌ఓసీ చెక్కు మంజూరైంది. ఆ చెక్కును ఆంధ్రప్రభ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే మల్లాది విష్ణు లబ్ధిదారుకు అందజేశారు. పేదల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 745 మందికి రూ. 3 కోట్ల 51 లక్షల 67 వేల 35 రూపాయలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. గతంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ విషయంలో చాలా అలసత్వం ఉండేదని.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆస్పత్రులకు బకాయిలను సైతం ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నట్లు ఎమ్మెల్యే గారు తెలియజేశారు.
Prajavartha Online Telugu News