గాంధీ జయంతిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లావ్) కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…

-బెంజ్ సర్కిల్ వేదిక నుండి 2600 చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లీన్ ఆంధ్రప్రదేశ్ ( బ్లాప్ ) – జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నరని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
స్థానిక బెంజ్ సర్కిల్ లో అక్టోబర్ 2వ తేదిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్న దృష్ట్యా సంబంధిత ఏర్పాట్లను మంగళవారం శాసనసభ్యులు మల్లాది విష్ణు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘరాం, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ పి. గౌతమ్ రెడ్డి, ఐడిసిసిబి ఛైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, స్వచ్ఛాంధ్రప్రదేశ్ యండి సంపత్ కుమార్, జిల్లా కలెక్టర్ జె. నివాస్, నగర సిపి బత్తిన శ్రీనివాసులు, వియంసి కమిషనర్ వి. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్లు డా. కె. మాధవిలత, కె. మోహన్ కుమార్, సబ్ కలెక్టర్ జి, సూర్యసాయి ప్రవీణ్ చంద్, డిసిపి హర్షవర్ధనరాజు, వైఎస్ఆర్ సిపి నాయకులు దేవినేని అవినాష్ తో కలిసి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత, చెత్త రహిత నగరాలుగా తీర్చిదిద్దడమే క్లాప్ – జగనన్న స్వచ్ఛ సంకల్పం లక్ష్యమన్నారు. రాష్ట్రంలో నివసించే ప్రతి పౌరునికి స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన పరిసరాలు కల్పించి తద్వారా జీవన ప్రమాణాలు పెంచాలనే ఆలోచనతో ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో 1500 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించనున్నట్లు తెలిపారు. తడిచెత్తను పొడి చెత్తను వేరు చేసి సేకరించేందుకు వీలుగా మున్సిపాలిటీల పరిధిలో ప్రతి ఇంటికి మూడు చెత్త బుట్టల చొప్పున కోటి ఇరవై లక్షల నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగు చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు.
జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసే ప్రత్యేక వేదిక నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2600 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అందరి అధికారుల సమన్వయంతో విజయవంతం చేసేందుకు పటిష్టమైన ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నామన్నారు. ఏలూరు, గుంటూరు వెళ్లే ప్రయాణికులు పోలీస్ అధికారులను ఉద్దేశించే రూట్ ప్లాన్‌ను గమనించాలని ఆయన సూచించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా తెలియజేయడం జరుగుతుందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

4వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంక్ ఉంది

-పామాయిల్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నాం -త‌ల‌స‌రి ఆదాయం రూ.4ల‌క్ష‌ల‌కుపైగా సాధాన ల‌క్ష్యం -ఏలూరు జిల్లా క‌లెక్ట‌ర్ వెట్రిసెల్వి అమ‌రావ‌తి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *