Breaking News

మైలవరం మండలంలో విసృత పర్యటన చేసిన సబ్ కలెక్టర్…

-గ్రామ సచివాలయం, ఆరోగ్య కేంద్రం, ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన సబ్ కలెక్టర్…
-ఇళ్ల నిర్మాణాలు వేగవంతం కావాలి…

విజయవాడ/మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం మండలంలో మంగళవారం విజయవాడ సబ్ కలెక్టర్ జి, సూర్యసాయి ప్రవీణ్ చంద్ విసృత పర్యటన చేసి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి తీరును పరిశీలించారు. తొలుత మైలవరం మండలం పుల్లూరు గ్రామంలో సీతారామపురం తాండలో పర్యటించిన సబ్ కలెక్బర్ ఆర్ వైఎస్ఆర్ వో భూములను పరిశీలించారు. అనంతరం మైలవరం మండలంలోని మోరుసుమిల్లి గ్రామంలో పర్యటించి ఇళ్ల లేఅవుటను, గ్రామ సచివాలయాన్ని, ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలందరికి ఇళ్లు పథకం కింద చేపడుతున్న జగనన్న ఇళ్ల కాలనీల్లో ఇంటి నిర్మాణాలు వేగవంతం కావాలన్నారు. ఈ సందర్భంగా ఇళ్ల లబ్దిదారులతో ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 1,80 లక్షలు అందించడంతో పాటు ఉచితంగా ఇసుక అందిస్తోందన్నారు. అంతేకాకుండా సిమ్మెంట్ స్టీల్ తక్కువ ధరకు అందించడం జరగుతుందన్నారు. కాలనీల్లో నీరు విద్యుత్ తదితర మౌలిక సదుపాయలను కూడా కల్పించడం జరుగుతుందని వీటిని దృష్టిలో పెట్టుకుని ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసుకోవాలన్నారు. ఇర్ల నిర్మాణాలకు సంబంధించి మ్యాపింగ్, రిజిస్టేషన్, జియో ట్యాగింగ్, పెండింగ్ లేకుండా వంద శాతం పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. అనంతరం గ్రామ సచివాలయాని ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని సచివాలయ సిబ్బందిచి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ సూచించారు. సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎ ఏ గడువులోగా ప్రజల సమస్యలను పరిష్కర తీరు, ప్రభుత్వ పథకాల పోస్టర్ల ప్రదర్శన తీరును ఆయన పరిశీలించారు. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్య సేవల తీరును, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందులను సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వీరి వెంట పలువురు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ప్రజలకు భరోసాగా నిలవాలి

-పరిష్కరించిన ఫిర్యాదు తిరిగి పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలి -సత్వర, నాణ్యమైన పరిష్కారమే ప్రజల సంతృప్తికి కొలమానం -ఫిర్యాదుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *