తల్లీ బిడ్డలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యం… : ఎంపీపీ గద్దే పుష్పరాణి

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తల్లీ బిడ్డల ఆరోగ్యమే లక్ష్యంగా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అంగన్ వాడీ కేంద్రాలు ద్వారా ప్రభుత్వం అందిస్తుందని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు గద్దే పుష్పరాణి అన్నారు. పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక ఎన్జీవో హోమ్ లో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జెడ్పీటీసీ రామకృష్ణ, ఎంపీడీవో వెంకటరమణ తో కలసి ఎంపీపీ పుష్పరాణి పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆమో మాట్లాడుతూ తల్లీ బిడ్డల సంక్షేమమే ఆంగన్ వాడీ కేంద్రాల ప్రదాన లక్ష్యంగా సేవలు అందిస్తున్నాయన్నారు. తల్లి బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్ వాడీ కేంద్రాలు ద్వారా పౌస్టికాహారాన్ని అందిస్తుందన్నారు. జెడ్పీటీసీ గోళ్ళ రామకృష్ణ మాట్లాడుతూ సమాజాభివృద్దికి ఆరోగ్యవంతమైన మానవ వనరుల వలనే సాధ్యమవుతుందన్నారు. అంగన్ వాడీ కేంద్రాలు ద్వారా అందిస్తున్న పోషక విలువలతో కూడీన ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
యంపీడీవో ఏ. వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. మహిళలు గర్భం ధరించిన నాటి నుంచి ప్రసవం జరిగి బిడ్డను జన్మించి ప్రాథమిక పాఠశాల కు వెళ్లే వరకు తల్లీ బిడ్డల ఆరోగ్యం సంక్షేమం, ఆహారం, విద్య పట్ల ప్రభుత్వమే భాద్యత తీసుకుంటుందన్నారు.
సీడీపీవో సముద్రవేణి మాట్లాడుతూ పౌష్టికాహార మాసోత్సవాలు గత నెలరోజులుగా జరుగుతున్నాయని అంగన్ వాడీ కేంద్రాలు ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలవులు గల ఆహారాన్ని ప్రజలకు ఏవిధంగా తీసుకోవలనే అంశాల పా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్బంగా 15 మంది మంది గర్భణీ స్త్రీలకు పుసుపు, కుంకుమ,చీర, జాకెట్టు అందించి సీమంతం కార్యాక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడఎస్ గుడివాడ నియోజకవర్గం సూపర్వైజర్లు అరుణకుమారి, విజయకుమారి, నాగజ్యోతి, జయంతి, పద్మావతి, బేబి సరోజిని,అంగన్ వాడీ కార్యకర్తలు, వర్కర్లు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *