Breaking News

కాల్వ వరద ఉదృతి తగ్గేవిధంగా ఉంది ప్రజలు భయపడవద్దు…

తణుకు, నేటి పత్రిక ప్రజావార్త :
తణుకు మండలం దువ్వ గ్రామం లో భారీ వర్షాల కారణంగా వయ్యే రు కాల్వ ఉదృతంగా ప్రవహించడం తో వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగిందని జె. సి. ఆసరా, కొవ్వూ రు ఇంచార్జ్ ఆర్డీఓ పి. పద్మావతి అన్నారు. దువ్వ గ్రామాన్ని అధికా రులతో బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా పద్మావతి మాట్లాడుతూ ప్రస్తుతం వయ్యేరు కాల్వ ప్రస్తుతం 14.5 అడుగులు ఉంద న్నారు. పాకలు నీట మునిగాయని సుమారు 60 కుటుంబాలు ఉంటా యని, సుమారు 140 మంది ప్రజ లు ఉంటారన్నారు. వీరికి వసతి కల్పించి, అల్పాహారం, భోజనాలు ఏర్పాట్లు చేసామని తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా కాల్వ గట్టు గండి పడే చోట ఇసుక, కంకర బస్తా లను ఏర్పాటు చేసామన్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులను అప్రమత్తం చేసామని తెలిపారు. కాల్వ వరద ఉదృతి తగ్గేవిధంగా ఉందని ప్రజలు భయపడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తాహిసీ ల్దార్, ప్రసాద్, సర్పంచ్ అడ్డా బాబు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంతల రహిత రహదారులతో పాటు పరిశుభ్రమైన నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంతల రహిత రహదారులతో పాటు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *