బెజవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు…

-పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ పూజారులు, ధర్మకర్తలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ లో గల ప్రసిద్ధ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ను బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ పూజారులు,ధర్మకర్తలు పూర్ణకుంభ స్వాగతం పలికి అమ్మ వారి దర్శనం చేయించి వేదపండితులు అమ్మ వారి వస్త్రాలతో సన్మానించి ఆశీర్వచనం అందచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కనకదుర్గమ్మ అమ్మవారిని కోరుకున్నానని అన్నారు.అమ్మ వారి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.రెండు రాష్ట్రాలు ఆర్థికంగా ఎదగాలని కోరుకున్నానని అన్నారు. విజయవాడకి ఎప్పుడు వచ్చినా అమ్మవారిని దర్శించుకుంటాను అన్నారు.

తదనంతరం, తన మిత్రుడైన బొంతు శ్రీనివాస్ రెడ్డి తండ్రి బాపి రెడ్డి మరణించగా వారి స్వగ్రామమైన గుంటూరు జిల్లా మున్నంగి గ్రామంలో శ్రీనివాసరెడ్డి కుటుంబసభ్యులను తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విత్తనం నాటిన ప్రతి రైతుకు ఫసల్ బీమా

-రైతుల ఆర్థిక భద్రతకు 100 శాతం ఫసల్ బీమా నమోదు -ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద విత్తనం నాటిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *