దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి ఆహ్వానం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఛైర్మన్ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణ అధికారి భ్రమరాంబ బుధవారం కలిశారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఈ సందర్భంగా  రాష్ట్ర గవర్నర్ కు అందచేశారు. అక్టోబర్ 07 నుంచి 15 వరకు ఆలయంలో జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనవలసిందిగా కోరారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ కి అమ్మవారి శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *