-అనాసాగరంలో మధ్యాహ్నం భోజనాన్ని స్వీకరించి ఆహార నాణ్యత పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించేందుకు గురువారం విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆయా మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. జగ్గయ్యపేటలో పోలీస్ స్టేషన్, తహాశీల్దార్ కార్యాలయం, రైతుబజార్‌లను సందర్శించారు. రైతుబజార్లో మౌలిక సదుపాయలను పరిశీలించి పలు కూరగాయల ధరలను తెలుసుకున్నారు. అనంతరం పబ్లిక్ టాయిలేట్ నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు.
అనంతరం నందిగామ మండలంలో అనాసాగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ విద్యార్థులతో కలసి మధ్యాహ్నం భోజనాన్ని స్వీకరించి ఆహార పదార్థల నాణ్యతను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ బాల్యం నుంచే చదువు పై మక్కువ పెంచుకోవాలన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు విద్యే మూలమన్నారు. కాలాన్ని వృదాచేయకుండా చదువు, దానితోపాటు సృజనాత్మక పెంపొందించేందుకు ఆయా అంశాలపై కూడా దృష్టి సారించాలన్నారు. అనంతరం ఇటీవల మరణించిన 10వ తరగతి విద్యార్థి దారం గోపిచరణ్ మరణానికి దారితీసిన పరిస్థితిలను సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ విచారించారు. తదుపరి కంచికర్ల మండలంలో పర్యటించిన సబ్ కలెక్టర్ యంఎస్ఎస్ పాయింట్ ను ఆకస్మిక తనిఖీ చేసి గౌడౌన్లో నిల్వ చేసిన బియ్యం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయా మండలాల తహాశీల్దార్లు, సంబందిత అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News