Breaking News

దేవినేని నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా సామాజిక సేవా కార్యక్రమాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ లో నిరుపేద కుటుంబనికి చెందిన లండా లక్ష్మి కి ఉపాధి కొరకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ. లక్ష విలువ చేసే విజయ డైరీ ఓట్లెట్ షాప్ ను అందజేసినట్టు ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. షాప్ ఓపెన్ చేసి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రస్ట్ ఛైర్మన్ దేవినేని అవినాష్ గారు రాజకీయంగా గానే కాకుండా సామాజిక బాధ్యతగా ట్రస్ట్ ద్వారా విద్య,ఉపాధి అవకాశాలు కల్పన లాంటి సేవ కార్యక్రమలు విస్తృతంగా చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గల్లా పద్మావతి, గల్లా రవి, జయ, తరుణ్, సింగ్, ప్రసాద్, ఇస్మాయిల్, శ్రీనివాస్, సహని, పద్మ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *