విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల, ప్రభుత్వ పథకాల అమలు తీరు, సంక్షేమం పట్ల ఆకర్షితులు అయ్యి, కరోనా సంక్షోభ సమయంలో అవినాష్, కార్పొరేటర్లు, ఇంచార్జిలు, నిత్యం ప్రజలలో ఉండి ప్రజా సమస్యల పట్ల స్పందించిన తీరుకు, ఆళ్ల చల్లారావు ఆధ్వర్యంలో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు దుర్గ, నాగరాజు నాయకత్వంలో బీజేపీ, టీడీపీ పార్టీ 100 మంది కార్యకర్తలు ఈరోజు తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వైసిపి పార్టీ కండువాలు కప్పి అందరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన అవినాష్ పార్టీలో చేరిన అందరికి తగిన ప్రాధాన్యత కల్పిస్తానని భరోసా కల్పించారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి వాహనమిత్ర పధకం రూపకల్పన చేసి వారికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారని అన్నారు. కొత్త పాత నాయకులు అందరూ కూడా ఎలాంటి తారతమ్యలు లేకుండా పార్టీ పటిష్ఠతకు కలిసిమెలిసి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావు, శెటికం దుర్గాప్రసాద్, బచ్చు మురళి, సొంగా రాజ్ కమల్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …