Breaking News

పేదల సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్‌ టాప్ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సెంట్రల్ నియోజకవర్గంలో చురుగ్గా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ
-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా నూతన పింఛన్ల అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కార్యక్రమం శుక్రవారం చురుగ్గా సాగింది. తెల్లవారుజాము నుంచే 21 డివిజన్లకు చెందిన సచివాలయ సిబ్బంది పింఛన్ నగదు పంపిణీని ప్రారంభించారు. నియోజకవర్గానికి సంబంధించి అక్టోబర్ నెలలో మంజూరైన 961 నూతన పెన్షన్లను గుణదల, కండ్రిక, అజిత్ సింగ్ నగర్, మధురా నగర్ సహా పలు డివిజన్ లలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీకి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు.

పెన్షన్ల పెంపు ఘనత జగనన్న ప్రభుత్వానిది…
చంద్రబాబు ప్రభుత్వంలో 39 లక్షల మంది మాత్రమే ఉన్న పెన్షన్ దారుల సంఖ్యను.. మానవీయ కోణంలో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి 61,46,908 కి పెంచడం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. పింఛన్లకు సంబంధించి తెలుగుదేశం హయాంలో నెలకు రూ. 400 కోట్లు కూడా అందించే పరిస్థితి లేదని.. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రూ. 1,420.48 కోట్లు నెలకు వెచ్చిస్తున్నట్లు తెలియజేశారు. చంద్రబాబునాయుడు ఏం చేసినా కుట్రపూరితంగానే ఉంటుందని మల్లాది విష్ణు అన్నారు. నాలుగున్నరేళ్ల పాటు రూ. వెయ్యి మాత్రమే ఇచ్చి.. ఎన్నికలు సమీస్తున్న తరుణంలో రూ. 2వేలు చేశారని గుర్తుచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి కూడా రూ. 2,250 లను అందించడం జరుగుతోందని వెల్లడించారు. మరోవైపు నగరంలో 52,709 మందికి మాత్రమే చంద్రబాబు పింఛన్ అందించారని.. ఆ సంఖ్యను 66 వేలకు పెంచిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిదన్నారు. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలోనూ 18వేల మందికి అందుతున్న పింఛన్ ను.. శాచ్యురేషన్ పద్ధతిలో 24,518 మందికి పెంచామన్నారు. సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ వెరిఫికేషన్ లో అర్హులను గుర్తించి వారందరికీ కూడా త్వరలోనే పెన్షన్ ను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

పింఛన్లపై వదంతులు నమ్మవద్దు…
దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులకు అందించే పింఛన్లపై ప్రతిపక్షాలు, పచ్చ మీడియా చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. అర్హత ఉన్న ఎవరికీ పింఛను తొలగించవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా తెలియజేశారని మల్లాది విష్ణు  తెలిపారు.

పింఛన్‌దారుల సౌలభ్యం కొరకు మరో నూతన నిర్ణయం…
అర్హులైన పింఛన్ దారులకు ఏ చిన్న ఇబ్బందీ కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని మల్లాది విష్ణు అన్నారు. లబ్ధిదారులు సొంత ఊరిలో కాకుండా ఆరు నెలల పాటు రాష్ట్రంలోని మరేయితర ప్రాంతాలలో నివాసం ఉన్నా కూడా.. ఉన్న చోటనే పింఛన్‌ పొందే వెసులుబాటును కల్పించిందని తెలియజేశారు. వైద్యం లేదా ఇతర కారణాలతో ఆరు నెలలు ఊరెళ్లిన వారికి ఈ నూతన విధానం ఉపయోగపడుతుందన్నారు. ఇందుకోసం తాము నివాసం ఉంటున్న పరిధిలోని గ్రామ/ వార్డు సచివాలయాలలో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు.

దేశానికే ఆదర్శం…
గత ప్రభుత్వాలలో పింఛన్ పంపిణీకి ఐదు నుంచి వారం రోజల సమయం పట్టేదని మల్లాది విష్ణు అన్నారు. వచ్చే పింఛన్ లో సగం ఆటో ఛార్జీలకే సరిపోయేదన్నారు. కానీ నేడు ప్రతినెలా ఒకటవ తేదీన తెల్లవార‌క‌ముందే ఇంటి వ‌ద్దకే వెళ్లి పింఛ‌న్లు అంద‌జేస్తున్న మన వాలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఏర్పాటైన ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు గుమ్మం ముందుకే చేరుతున్నాయన్నారు. దేశంలోని మరేయితర రాష్ట్రంలోనూ ఇటువంటి వ్యవస్థ లేదన్నారు.

స్వచ్ఛ సంకల్పంలో భాగస్వాములవుదాం…
మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్‌ 2న ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ – జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని మల్లాది విష్ణు అన్నారు. ఈ సందర్భంగా 2,600 చెత్త సేకరణ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని తెలియజేశారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ ఈ కార్యక్రమానికి వేదిక కావడం మనందరికీ గర్వకారణమన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగంగా చేపట్టిన క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో ప్రతి ఒక్కరం భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు.

మరోవైపు కరోనా కారణంగా ఆర్.యూ.బి. పనులు వాయిదా పడ్డాయని.. త్వరలోనే పనులు పూర్తిచేసి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి 24*7 మంచినీరు అందించే దిశగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. మోటార్లకు మీటర్లు పెడతారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *