సచివాలయం ఆకస్మిక తనిఖీ… : క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. సంక్షేమ పథకముల వివరాలు విధిగా నోటీసు బోర్డులో ఉంచాలని పేర్కొన్నారు. శుక్ర‌వారం రామలింగేశ్వర నగర్ నందలి 68 మరియు 69 సచివాలయాలను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పర్యటనలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్మెంట్ రిజిస్టర్‌ను పరిశీలించారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల హాజరు శాతం, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై వచ్చే దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *