Breaking News

కనకమేడల రవీంద్ర కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్(ASG) గా నియమితులైన సీనియర్ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ మాజీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర ని లబ్బీపేట లోని వారి నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. రాజ్యసభ సభ్యునిగా విశేష సేవలందించిన కనకమేడల రవీంద్ర ఇకపై అత్యున్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం తరఫున కీలక వాదనలు వినిపించనుండటం ఎంతో ఆనందంగా ఉంది. దేశంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పదవిలో తెలుగు వ్యక్తి నియమితులు కావటం ఎంతో గర్వంగా ఉంది. అభినందనలు తెలియజేసిన మాదిగాని గురునాథం, వల్లభనేని నరసింహ చౌదరి, కొత్తపల్లి ఆనంద్ స్వరూప్, సీనియర్ న్యాయవాది, టిడిపి లీగల్ సెల్ కార్యదర్శి మరియు కిలారి చంద్రశేఖర్ లాయర్ వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *