శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కోడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
హంసలదీవి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. హంసలదీవిలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణు గోపాల స్వామి వారిని శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి హంసలదీవి బీచ్ సందర్శించారు. మంత్రి వెంట రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, బందరు ఆర్డీవో ఎన్ఎస్ కే ఖాజావలి, డిఎస్పి మహబూబ్ బాషా, తాసిల్దార్ లతీఫ్ భాష, పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *