అహింస, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి, మహాత్మా గాంధీ…

కొవ్వూరు ,  నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం చైర్ పర్సన్ బావన రత్న కుమారి జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింస, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి, ఆయన జన్మదినాన్ని స్ఫూర్తి గా తీసుకుని స్వచ్ఛ కొవ్వూరు ద్వారా పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ కేటి సుధాకర్, కౌన్సిలర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్డీవో కార్యాలయంలో మహాత్మునికి ఘన నివాళి:
శనివారం కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలోజాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి కార్యాలయ పరిపాలనాధికారి జి ఎస్ ఎస్ జవహర్ బాజీ, ఇతర సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత

-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *