-టిడిపి జిల్లా అధ్యక్షరాలు, ప్రధాన కార్యదర్శులను సన్మానించిన ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షురాలు గద్దె అనూరాధ, ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు మర్యాదపూర్వకంగా ఎంపీ కేశినేని శివనాథ్ ను మంగళవారం కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ,ఎన్టీఆర్ భవన్ కువిచ్చేసిన వీరికి ఎంపీ కేశినేని శివనాథ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం వారిద్దర్ని శాలువాతో సత్కరించి కొండపల్లి బొమ్మలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ షిబ్లీ, రాష్ట్ర ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ సావల దేవదత్, రాష్ట్ర నాగవంశం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, రాష్ట్ర సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాల కోటయ్య లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News