Breaking News

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అరకు కాఫీ ఫ్రాంచైజీ ప్రారంభం

-జి.సి.సి అర‌కు కాఫీ తో ఎంతో మందికి ఉపాధి
-ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్ల‌డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్ర‌భుత్వం గిరిజ‌నాభివృద్దిలో భాగంగా గిరిజ‌న కో-ఆప‌రేటివ్ కార్పొరేష‌న్ ద్వారా అర‌కు కాఫీకి మంచి ఆద‌ర‌ణ ల‌భించేలా కృషి చేస్తోంద‌ని, ప్ర‌జ‌లు కూడా అర‌కు కాఫీను బాగా ఆద‌రిస్తున్నార‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ తెలిపారు. విజ‌య‌వాడ ప్ర‌భుత్వ హాస్ప‌ట‌ల్ ఆవ‌ర‌ణ లో ఏర్పాటు చేసిన జి.సి.సి అర‌కు కాఫీ ఫ్రాంచైజీ స్టాల్ ను మంగ‌ళ‌వారం ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ క‌లిసి ప్రారంభించారు. అలాగే క‌స్ట‌మ‌ర్ల‌కు కాఫీలు అందించారు. అనంతరం వారు కూడా అర‌కు కాఫీ సేవించారు. ప్రభుత్వ ఆసుపత్రి వంటి ప్రజా కేంద్రాల్లో అరకు కాఫీ అందుబాటులోకి తీసుకువ‌చ్చి ప‌ది రూపాయ‌ల‌కే నాణ్యమైన కాఫీ అందిస్తున్నందుకు నిర్వ‌హ‌కురాలను అభినందించారు.
అనంతరం ఫ్రాంచైజీ నిర్వహకులైన వడ్లమాని అంబా భాయ్ మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన ఆరోగ్యకరమైన అరకు కాఫీని అతి తక్కువ ధరలో కస్టమర్లకు అందించటమే తమ లక్ష్యమని, తద్వారా గిరిజనుల అన్ని రకాల అభివృద్ధిలో తమ వంతు సహాయం చేస్తామని తెలియజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జి జి హెచ్ సూపరిండెంట్ ఏ. వెంకటేశ్వరరావు, కార్పొరేట‌ర్ ముమ్మ‌నేని ప్ర‌సాద్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు ప‌రుచూరి ప్ర‌సాద్, టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చ‌ర‌ణ్ సాయి యాద‌వ్ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *