Breaking News

ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆదివారం ఉదయం నగరంలో నిర్వహించే సైక్లింగ్, వాకింగ్ కార్యక్రమాలను కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఏర్పాటు చేస్తున్నాం…

-కలెక్టరు జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పరిశుభ్రత, స్వచ్చ సర్వేక్షన్, సాలిడ్ వేస్ట్ మెనేజ్మెంట్ పై పలు కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని కలెక్టరు జె. నివాస్ తెలిపారు. నగరంలోని జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయంలో ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా చేపట్టనున్న కార్యక్రమాలకు సంబందించి పోస్టర్లను శనివారం కలెక్టరు జె. నివాస్, జాయింట్ కలెక్టర్లు కె. మాథవీలత, ఎల్. శివశంకర్, కె. మోహన్ కుమార్, సబ్ కలెక్టరు ప్రవీణ్ చంద్, వియంసీ అదనపు కమీషర్ శారదలతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టరు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, పరిశరాలు పరిశుభ్రతపై సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు నగరంలో పలు కార్యక్రమాలను నగరపాలక సంస్థ చేపట్టి చేస్తుందన్నారు. అక్టోబరు 2 శనివారం ఉదయం 12 గంటలకు ఎన్ఆర్పీ రోడ్ సత్యనారాణపురంలోను సాయంత్రం 5 గంటలకు వారసత్వం మరియు సాంస్కృతిక సాంప్రదాయాలు పునరుజ్జీవం పై పలు కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా అక్టోబరు 3 వ తేదీ ఉ. 6.30 గంటలకు సైకిల్ ర్యాలీ ప్రోగ్రాం బెంజ్ సర్కిల్ నుంచి ప్రారంభమై రామవర్పాడు, బీఆర్టీఎస్ రోడ్, మరియు పోలీసు కంట్రోల్ రూమ్ మీదుగా ఇంధిరా గాంధి స్టేడియం చేరుకుంటారని, ఉ.6.45 గంటలకు నడక ర్యాలీ పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రారంభమై మహాత్మా గాంధి రోడ్డు మీదుగా ఇందిరా గాంధి స్టేడియం చేరుకుంటాన్నారు. ఉదయం 9 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చిన్నారులతో కళాత్మకమైన ప్రదర్శనా ఉత్సవాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టరు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందకు 7 సంవత్సరాలు నుంచి 75 ఏళ్ల వయస్సు లోపు వారందరు పాల్గొనవచ్చునని తెలిపారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ కార్యక్రమంలో పాల్గొనే వారికి అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. సైకిల్, వాకింగ్ కార్యాక్రమాల్లో పాల్గొనే వారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని తమ పేర్లును నమోదు చేసుకోవచ్చునని, స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించినట్లు కలెక్టరు తెలిపారు. ఆజాదికా అమృత్ మహోత్సవ్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు(రెవెన్యూ) మాథవీలత, జాయింట్ కలెక్టరు(అభివృద్ది) శివశంకర్, జాయిట్ కలెక్టరు(ఆసరా) మోహన్ కుమార్, సబ్ కలెక్టరు ప్రవీణ్ చంద్, వియంసీ అదనపు కమీషర్ యు. శారద పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టూరిజం ఎండీ పట్టన్ శెట్టి రవి సుభాష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *