యువత క్రీడలు పట్ల ఆసక్తి చూపిస్తూ జీవితంలో అలవాటుగా మార్చుకొని శరీర దారుడ్యాన్ని పెంచుకోవాలి…

అజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా సైకిల్ థన్, వాకింగ్ థన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన…
-రాష్ట్ర రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. రజత్ భార్గవ్, కలెక్టరు జె. నివాస్, నగరపోలీసు కమీషనర్ బత్తిన శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమీషనరు ప్రసన్న వెంకటేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నగరంలోని బెంజ్ సర్కిల్ నందు విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి సైకిల్ థన్ వాకింగ్ థన్ కార్యక్రమాలను రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. రజత భార్గవ్ ప్రారంభించారు. జిల్లా కలెక్టరు జె.నివాస్, నగర పోలీసు కమీషనరు బత్తిన శ్రీనివాస్, నగరపాలక సంస్థ కమీషనరు ప్రసన్న వెంకటేష్, సబ్ కలెక్టరు ప్రవీణ్ చంద్, నగరపాలక సంస్థ అధనపు కమీషనర్ శారదాదేవి కార్యక్రమములో పాల్గొన్నారు.

స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. రజత భార్గవ్ మాట్లాడుతూ ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నగరపాలక సంస్థ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, పరిశరాలు పరిశుభ్రతపై పలు కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈరోజు ఇంత ఉదయాన్నే పెద్ద ఎత్తున సైకిల్ థన్, వాకింగ్ థన్ లో పాల్గొనేందుకు యువత ఉత్సాహంతో రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అయిన సందర్బంగా ఏడాది పాటు నిర్వహించే ఆజాదీకా అమృత్ మహోత్సవాలను ఢిల్లోలో ప్రదానమంత్రి నరేద్రమోడి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారన్నారు.

కలెక్టరు జె. నివాస్ మాట్లాడుతూ ఇంత ఉదయాన్నే ఆజాది కా అమృత్ మహోత్సవ్ సైకిల్ థన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మీ అందరికీ దేశం పట్ల ప్రేమ, ఆరోగ్య పట్ల శ్రద్దకు నిదర్శనం అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి వారం జరగాలని, మీరందరూ ప్రతి రోజు స్లైక్లింగ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేసారు.

నగర పోలీస్ కమిషనర్ బి. శ్రీనివాసులు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లులో ఎన్నో విజయాలు, ఎంతో అభివృద్ది జరిగిందన్నారు. చిన్నచిన్న దేశాలు క్రీడల్లో మంచి ఫెర్మార్మెన్సు ఇస్తున్నాయని, 130 కోట్లు గల భారత దేశంలో క్రీడలు మరింత అభివృద్ది చెందాలన్నారు. గత రెండు, మూడు ఒలంపిక్స్ లో దేశం క్రీడల్లో కొన్ని విజయాలు సాధించినప్పటికీ, యువత క్రీడలు పట్ల ఆసక్తి చూపించి అలవాటుగా మార్చుకొని శరీర దారుడ్యాన్ని పెంచుకోవాలన్నారు. నగరపాలక సంస్థ పిలుపు మేరకు ఇంత మంది సైక్లింగ్, వాకింగ్ లో పాల్గొనేందుకు రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

తొలుత రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. రజత భార్గవ్, కలెక్టరు జె.నివాస్, నగర పోలీసు కమీషనరు బత్తిన శ్రీనివాస్ శుభ సూచికంగా ఆకుపచ్చ, తెలుపు, కాషాయి రంగుల్లో ఉన్న బెలూన్లను ఎగరవేసి, జెండా ఊపి సైకిల్ థన్ ర్యాలీని మరియు తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నుండి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు ఏర్పాటు చేసిన వాకింగ్ థన్ కార్యక్రమాన్ని ప్రారంబించారు. సైకిల్ థన్ బెంజ్ సర్కిల్ నుంచి ప్రారంభమై రామవరప్పాడు, బీఆర్టీఎస్ రోడ్, మరియు పోలీసు కంట్రోల్ రూమ్ మీదుగా ఇంధిరా గాంధి స్టేడియం చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన ముగింపు వేడుకలలో పోలీస్ కమిషనర్ చేతుల మీదగా సైక్లింగ్ మరియు వాకింగ్ లో పాల్గొనిన వారికీ మెడల్స్ బహుకరించారు. ఈ సందర్బంలో దేశ భక్తి గేయాలతో మరియు యోగా తో చిన్నారుల చేసిన సంస్కృతికి కార్యక్రమాలు ఎంతో ఆకర్షనియంగా నిలిచి అందరిలో ఉత్సాహన్ని నింపాయి. కోవిడ్ దృష్టిలో ఉంచుకొని ఫిట్నెస్ కలిగియుండి, రెండు డోస్ ల వ్యాక్సిన్ వేసికోనిన వారిని కార్యక్రమములలో అనుమతి ఇవ్వడం జరిగిందని అధనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) వివరించారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *