దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ కి ఆహ్వానం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ ని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, సామ వేదపండితులు కె.నరసింహ మూర్తి ఆదివారం కలిశారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఈ సందర్భంగా శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీకు అందచేశారు. అక్టోబర్ 07 నుంచి 15 వరకు ఆలయంలో జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనవలసిందిగా కోరారు. అనంతరం శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ కి అమ్మవారి శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *