మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెనుకబడిన తరగతుల వర్గాల స్త్రీల అభ్యున్నతికి ఆర్ధిక సహాయం అందించే ఉద్దేశ్యంతో “ఇ.బి.సి నేస్తం” పధకం ప్రారంభించబడనున్నదని, ఈ పధకం అమలుకు కసరత్తు ప్రారంభించాలని సంబంధిత అధికారులను జిల్లా క లెక్టర్ జె.నివాస్ ఆదేశించారు.
సోమవారం ఉదయం కలెక్టర్ వారి కార్యాలయం సమావేశపు హాలులో ఆయన జాయింట్ కలెక్టర్లు డా. కె. మాధవీలత (రెవిన్యూ ) , ఎల్. శివశంకర్ (అభివృద్ధి), కె.మోహనకుమార్ (ఆసరా) లతో కలసి స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్పందన కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెలలో 3 పథకాలు జగనన్న చేదోడు, జగనన్న తోడు మరియు ఇ.బి.సి నేస్తం పథకాలు అమలుకానున్నాయని, వీటిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలన్నారు. జగనన్న చేదోడు, జగనన్నతోడు వంటివి ఇదివరకే ఉన్న పధకాలు కాబట్టి లబ్దిదారుల జాబితాను పునఃపరిశీలించుకోవాలన్నారు. ఇ.బి.సి నేస్తం పథకం ద్వారా 45 సం.రాల నుంచి 60 సం.రాల వయస్సు కలిగిన ఇ.బి.సి వర్గములకు (ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, కాపు, తెలగ, బలిజ మరియు ఒంటరీ కులములు కాకుండా) చెందిన స్త్రీలకు 2021-22 నుంచి 2023-24 సంవత్సరం వరకు అనగా 3 సం. రాల పాటు, సంవత్సరానికి రూ. 15 వేలు చొప్పున 3 సంవత్సరాలకు మొత్తం రూ. 45 వేల రూ.లు ఆర్థిక సహాయం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అర్హుల జాబితాను ఈ నెల 21వ తేది లోపు సిద్ధం చేయాలని, ఇందుకు గ్రామ / వార్డు వాలంటీర్ల ద్వారా నియమ నిబంధనల ప్రకారము లబ్దిదారులను ఎంపిక చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
గ్రామ | వార్డు వాలంటీర్లు వారి పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి 18 నుండి 44 సం.రాల వయస్సు వారికి వ్యాక్సిన్ పూర్తి చేయించే విధంగా వైద్యాధి కారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా జగనన్న ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రతి మండలంలోను 500 మంది లబ్ధిదారులకు మెటిరీయలను అందుబాటులో ఉంచాలని ఎ.ఇ మరియు డిఇలను ఆదేశించారు.
అర్జీల పరిష్కారానికి కృషి చేయాలి?
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జాయింట్ కలెక్టర్లతో కలసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పెద్ద మొత్తంలో అర్జీలు స్వీకరించారు.
అర్జీల వివరాలు :
తన కొడుకు వాగే వాసు (14) పుట్టుక నుంచే వికలాంగుడని, చేతి వేలిముద్రలు పడటం లేదన్న కారణంతో వికలాంగ పింఛను నిలుపుదల చేశారని, దీనిపై విచారణ జరిపించి తన కొడుకుకు పింఛను కొనసాగించవలసిందిగా కైకలూరు మండలం వేమర్పాడు గ్రామానికి చెందిన వారే సుకన్య అర్జీ సమర్పించింది.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, మచిలీపట్నం నందు ఇప్పటి వరకు విధులు నిర్వర్తిస్తూ వచ్చామని, తమకు జీతాలు ఇవ్వకుండా విధుల నుంచి అర్ధాంతరంగా తొలగించారని, కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని వైద్యం అందించడంలో కృషి చేసిన తమను దయతో తిరిగి విధుల్లో చేర్చుకోవాలని హెచ్ఎంఎఫ్ డబ్ల్యూ కోవిడ్ 19 స్పెషల్ రిక్రూర్డ్ మెంట్ ద్వారా విధులు నిర్వర్తించిన ఎం. ప్రతాప్ తదితరులు అర్జీ సమర్పించారు.
పామర్రు మండలం రిమ్మనపూడి గ్రామానికి చెందిన తుమ్మల శేషమ్మ తన భర్త చనిపోయడని, ఇల్లు లేని కారణంగా పామర్రులో నివాసం ఉంటున్నానని, ఆధార్ మరియు రైస్కార్డు రిమ్మనపూడి అడ్రస్సుతో ఉండటం వలన పామర్రులో పింఛను ఇవ్వడం కూదరదని, నిలుపుదల చేసిన పింఛను తగు విచారణ జరిపించి మరల తనకు పింఛను మంజూరు చేయించవలసిందిగా కోరింది.
పిఎంకెవై సంస్థలో ట్రైయినర్ గా పని చేస్తున్న దేవరకొండ రేవతి (21స.లు), విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా కనిపించకుండా పోయించదని, ప్లానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికి ఫలితం లేకుండా పోయిందని, దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకొనవలసిందిగా విజయవాడకు చెందిన రేవతి అక్క, అన్నయ్యలు అర్జీ సమర్పించారు.
Prajavartha Online Telugu News