-నిర్ణీత సమయంలోపే ఆర్జీలు పరిష్కారించాలి…
-సబ్ కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారానికి 140 అర్జీలు అందాయని సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ తెలిపారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ప్రజలనుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలకు సత్వర పరిష్కరం చూపించాలని ఆయా శాఖల అధికారులకు సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ సూచించారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ (సిసిఎల్) 45, పౌర సరఫరాలు 2, హౌసింగ్ 46, పోలీస్ 4, పురపాలక 18, హెల్త్ 3, పంచాయతీరాజ్ 11, ఇతర అన్ని శాఖలకు సంబంధించి మరో 12 ఆర్జీలు కలిపి మొత్తం 140 అర్జీలు స్పందన ద్వారా అందాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత సమయంలో పే స్పందనలో వచ్చిన ఆర్జీలు పరిష్కారించాలన్నారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. స్పందనలో అందిన వినతుల్లో కొన్నింటిని అక్కడికి అక్కడే సంబంధిత తహాశీల్దార్లకు, ఫోన్ చేసి పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విజయవాడకు చెందిన మేక సోమయ్య వినతి పత్రం ఇస్తూ తాను తమ పోలం వివరాలు పాస్ పుస్తకంలో తప్పు దొర్లిందని వాటిని మార్పు చేయాలని కోరారు. దీనిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని తహాశీల్లారు సట్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ఆదేశించారు.
ఎర్రుపాలెం మండలం కొత్త పాలెంకి చెందిన పెద్ద శెట్టి బాలకృష్ణరావు వినతి పత్రం ఇస్తూ తమకు పియం కిసాన్ డబ్బులు రాలేదని దానితో పాటు ఇతర రాయతీలు కూడా మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సబ్ కలెక్టర్ స్పందిస్తూ వాటి విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
విజయవాడ చిట్టినగర్‌కు చెందిన సత్తాల పుష్పలత వినతి పత్రం ఇస్తూ తాము గతంలో అద్దెకు వున్న ఇంటి యజమాని తమ ఆధార్ కార్డుపై విద్యుత్ సర్వీసు పొంది ఉన్నారని దీని మూలంగా తమ రేషన్ కార్డు రద్దు అయిందన్నారు. తమ ఆధార్ పై ఉన్న విద్యుత్ సర్వీసు రద్దుపరచి రేషన్ కార్డు పునరుద్ధరించాలని కోరారు. దీనిపై సబ్ కలెక్టర్ సమగ్ర పరిశీలన చేసి పిమ్మట సంబందిత విద్యుత్ సర్వీసు ఆ ఇంటి యజమానికి బదలయించి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపి ఆపిడిసిఎల్ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో కార్యాలయ ఏఓ ఎస్. శ్రీనివాస్ రెడ్డి, డిఎల్ పివో కె.పి చంద్రశేఖర్, సిడిపివో ఎస్. సువర్ణ, ఆర్టీసీ డిపో మేనేజర్ కె. బసవయ్య తదితర 15 శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News