-మండలవారి లక్ష్యాలు నిర్దేశించిన జెసి డవలప్మెంట్ ఎల్. శివశంకర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జాయింట్ కలెక్టర్ డవలప్మెంట్ ఎల్. శివశంకర్ కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాలులో సోమవారం బందరు డివిజనుకు సంబంధించి ఎంపిడివోలు, తహసిల్దార్లు, హౌసింగ్ డిఇ, ఎఇలు, ఉపాధిహామి ఎపివోలతో సమావేశం నిర్వహించి బందరు డివిజనులో గృహనిర్మాణ పురోగతిపై మండల వారి సమీక్షించారు. ఆయా మండలాల్లో గల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఒకొక్కరు రోజుకు కనీసం 5 గృహలు బెన్మెంట్ స్థాయికి నిర్మించుకునేలా చూడాలని, ఈ విధంగా ప్రతి మండలానికి వచ్చేవారానికి గృహనిర్మాణాలు ప్రారంభించడం గురించి లక్ష్యాలు నిర్దేశించారు. ప్రతి మండలంలో మొత్తం లే అవుట్లు, పట్టాలు పొందిన లబ్దిదారుల సంఖ్య, ఇప్పటి వరకు ప్రారంభించిన గృహలు, ఇంకను ప్రారంభించవలసిన గృహలపై ఆరా తీశారు. బెన్మెంట్ స్థాయి గృహలను రూఫ్ లేవల్ స్థాయికి తీసుకువెళ్లాలని అన్నారు. ఇంకా గృహనిర్మాణాలు ప్రారంభించని లబ్దిదారులను మోటివేట్ చేయాలని అన్నారు. స్వయం సహాయ సంఘాలలో సభ్యులైన లబ్దిదారులకు రుణాలు అందజేయాలని, రుణాలు పొందిన లబ్దిదారులు రుణం సొమ్ము ఇతర ఖర్చులకు వినియోగించుకోకుండా ఖచ్చితంగా వారి ఇళ్ల బెన్మెంట్ నిర్మించుకునేలా చూడాలన్నారు. గొడౌన్ సౌకర్యం లేని చోట తుఫాను రక్షిత భవనాలు వినియోగించుకోవచ్చునని సూచించారు. లబ్దిదారులైన వాలంటీర్లు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడి వర్కర్లు, మధ్యాహ్నం భోజన పధకం అయాలు, వివోలు, డ్వాక్రా గ్రూపు అధ్యక్షుల వంటి ప్రభుత్వ సంస్థలలో పని చేస్తున్న వారితో ఖచ్చితంగా గృహనిర్మాణం ప్రారంభించేలా చూడాలన్నారు. అక్టోబర్ లో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున గృహనిర్మాణాలు వేగవంతం చేయలన్నారు. ప్రతి మండలంలో మెటీరియల్ గొడౌన్లలో 400 నుండి 500 మంది లబ్దిదారులకు సరిపడా ఐరన్, సిమెంట్ వంటి మెటీరియల్ ఎల్లపుడు సిద్ధంగా ఉంచాలన్నారు. ఎంపిడివో, తహసిల్దారు, వెలుగు, ఉపాధిహామి అధికారులతో కూడిన బృందాలు వ్యక్తి గతంగా లబ్దిదారులతో మాట్లాడి గృహాలు అందరు నిర్మించుకునేలా మోటివేట్ చేయాలని తద్వారా గృహనిర్మాణ ప్రగతి సాధించాలని అన్నారు. కొన్ని చోట్ల గల హౌసింగ్ ఎఇ ఖాళీలలో సీనియారిటి గల ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించుటకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఈ సమావేశంలో ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి, పిడి డ్వా మా జి.వి. సూర్యనారాయణ, హౌసింగ్ పిడి రామచంద్రాస్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News