బందరు మండలంలో పాడైన రోడ్ల మరమ్మత్తులకు చర్యలు చేపడతాం… : మంత్రి పేర్ని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బందరు మండలంలో దెబ్బతిన్న రోడ్లన్నింటికి మరమ్మత్తులు చేపట్టి అభివృద్ధికి చర్యలు చేపడతామని రాష్ట్ర రవాణా సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు.
శుక్రవారం మంత్రి కార్యాలయం వద్దకు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుండి వివిధ సమస్యలతో వచ్చిన ప్రజానీకాన్ని మంత్రి కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
బందరు మండలం భోగిరెడ్డిపల్లి గ్రామంలో సమస్యలు సర్పంచ్ గరికిపాటి శ్రీరాములు గ్రామస్థులతో కలసి మంత్రికి వివరించారు. గ్రామంలో గౌడపాలెం సెంటరు నుండి రామఖండం వరకు పాడైన తారురోడ్డు మరమ్మత్తులు చేయించాలని, పుష్కరషూట్ వరకు విద్యుత్ లైను వేయించాలని, 35 కరెంటు స్థంభాలు అవసరమవుతాయని చర్యలు తీసుకోవాలని కోరగా బందరు మండలంలో పాడైన రోడ్లన్నీ మరమ్మత్తులు చేపట్టుటకు అంచనాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించినట్లు, నిధులు మంజూరు చేయించి రోడ్లు అభివృద్ది చేపడతామన్నారు. ఇదే గ్రామంలో నిర్మించిన ఓ హెఎస్ఆర్ ఈ నెల 10న ప్రారంభించుటకు మంత్రిని ఆహ్వానించారు.
వృద్ధాప్య పింఛను మంజూరు చేయించాలని ఓ వృద్ధుడు కోరగా ఈయనకు రికార్డుల ప్రకారం మాగాణి, మెట్ట కలిసి 10 ఎకరాల దాకా పొలం ఉన్నందున నిబంధనల ప్రకారం అనర్హులని మంత్రి స్పష్టం చేస్తూ నిరు పేదలకే సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నదని, పథకాల కోసం మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు మంజూరుకు ఎవరి సిఫారసులు అక్కరలేదని అన్నారు.
కెడిసిసి బ్యాంకులో ఉద్యోగం పొందుటకు సిఫారసు చేయించాలని మరో యువకుడు కోరగా సిఫారసులతో ఉద్యోగాలిస్తే కోర్టు కేసులు, ఆర్టీఐ కేసులు వంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని ఉద్యోగం ఇచ్చిన వారి పదవికి ఎసరు వస్తుందని, పూర్తి ప్రతిభ ఆధారంగా అర్హతల మేరకు ఉద్యోగాల ఎంపిక జరుగుతుందని అన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *