Breaking News

చైల్డ్ ఫండ్ , యూనిసెఫ్ సంయుక్తంగా హ్యాండ్ హైజీన్ క్యాంపెయిన్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చైల్డ్ ఫండ్ , యూనిసెఫ్ సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన హ్యాండ్ హైజీన్ క్యాంపెయిన్ ప్రాజెక్ట్ లో భాగంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఫుట్ ఆపరేటింగ్ హ్యాండ్ వాష్ స్టేషన్ ను విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ను తరిమి వేయటం లో ముఖ్య భాగంగా హ్యాండ్ హైజిన్ కెంపయిన్ నిర్వహిస్తున్న చైల్డ్ ఫండ్, యూనిసెఫ్ సేవలు మన జిల్లాలో వున్నవారికి అద్భుతం గా ఉపయోగపడుతూ ప్రజల్లో సరైన పద్ధతులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే సచివాలయంలో కూడా ఈ ఫుట్ ఆపరేటింగ్ హ్యాండ్ వాష్ స్టేషన్ ఉంచడం ద్వారా సచివాలయం లోకి వచ్చే ముందుగా కచ్చితంగా చేతులు శుభ్రపరుచుకుని రావడం ద్వారా వారి నిత్యాజీవితం లో కూడా రెగ్యులర్ గా హ్యాండ్ వాష్ అనేది అలవాటు చేసుకుంటారన్నారు.ఈ ప్రాజెక్ట్ లో భాగంగా జిల్లా లోని 15 అర్బన్, రూరల్ ప్రాంతాల్లో వున్న గ్రామ ,వార్డు సచివాలయాల నందు ఫుట్ ఆపరేటింగ్ హ్యాండ్ వాష్ స్టేషన్ లను ఏర్పాటు చేయడానికి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇండియా సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సౌజన్య లత, నెహ్రు యువ కేంద్రం జిల్లా యూత్ కో ఆర్డినేటర్ సుంకర రాము గారు , చైల్డ్ ఫండ్ సిబ్బంది టైసన్, షాజాద్, మల్లేష్, భవాని, గౌరి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వయోవృద్ధుల పోషణ, డిజిటల్ మోసాల నియంత్రణకు చట్టాలు సవరించాలి

-పార్లమెంట్‌లో రెండు కీలక ప్రైవేట్ మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టిన వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి న్యూఢల్లీి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *