Breaking News

2కోట్ల58 లక్షల రూపాయల మహిళలకు ఆసరా… : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ప్రతి పధకంలో మహిళలకు పెద్దపీట వేస్తున్న అసలైన మహిళా పక్షపతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం పరిటాల ఓంకార్ కళ్యాణ మండపంలో జరిగిన రెండవ విడత వైస్సార్ ఆసరా లబ్ధిదారులతో జరిగిన ఆసరా సంబరాలు కార్యక్రమంలో అవినాష్ ముఖ్యమంత్రి గా పాల్గొని 4,10,11 డివిజిన్లలో 252 గ్రూపులకు మంజూరు అయిన దాదాపు 2కోట్ల58 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా వైస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలలో గాని,ఇళ్ల పట్టాల మంజూరు లో గాని,రాజకీయంగా పదవులు ఇవ్వడంలో గాని ప్రతి దానిలో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వారికి సామాజికంగా గౌరవాన్ని ఇస్తున్నారు అని అన్నారు.వైస్సార్ ఆసరా,చేయూత, అమ్మఓడి ఇలా ప్రతి పధకంలో నేరుగా మహిళల ఖాతాలలోనే నగదు జమ చేస్తున్నారు అని,మహిళలు ఈ పధకాలను ఉపయోగించుకొని స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని అవినాష్ ఆకాంక్షించారు.అక్కచెల్లెమ్మ ల చల్లని దివేనల్తో రాబోయే 30 సంవత్సరాలు జగన్ గారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉంటారని,ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని విష ప్రచారలు చేసిన వారు అధికారంలోకి రావడం జరగని పని అని ఎద్దేవా చేశారు. కేవలం సంక్షేమ పథకాలు అమలు మాత్రమే కాకుండా అభివృద్ధి లో కూడా రాష్ట్రానన్ని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కో ఆప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు, 4 డివిజన్ ఇంచార్జి గల్లా పద్మావతి వైసీపీ నాయుకులు సందీప్ రెడ్డి, చిమట బుజ్జి, రామాయణపు శ్రీనివాస్, పళ్లెం రవి,దామోదర్, పటమట దుర్గాప్రసాద్, గోళ్ళ శ్రీను,జయరాజ్ మరియు మూడు డివిజన్ లు నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, సామాన్య ప్రయాణికుల సౌకర్యాలపై పార్లమెంటులో ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో రైలు ప్రయాణం, రైల్వే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *