Breaking News

నేరాల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోండి… : అధికారులకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నేరాల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం అక్రమ మద్యం నియంత్రణ, నేరాల నియంత్రణ, జి .ఎస్.టి. వసూళ్లు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యకలాపాలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా కూడా అక్రమ మద్యం, బెల్ట్ షాపులు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీ మద్యం, అక్రమ మద్యం తయారీ దారులపై దాడులు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు వినియోగాన్ని అరికట్టాలన్నారు. నేరాలు జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ అమ్మకాలపై పటిష్టమైన నిఘా పెట్టి డ్రగ్స్ అమ్మే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. డ్రగ్స్ అమ్మే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అప్రమత్తం ఉండి నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. జి.ఎస్.టి. వసూళ్లపై సమీక్షిస్తూ, చేసిన ప్రతీ కొనుగోలుకు బిల్లు తప్పనిసరిగా తీసుకునేలా వినియోగదారులతో అవగాహన కలిగించాలన్నారు. పన్నుల వసూళ్ళలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా వాణిజ్య శాఖాధికారులు పనిచేయాలన్నారు. సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమీషనర్ రఘునాథ్, ఎక్సయిజ్ శాఖాధికారులు కృష్ణ కుమారి, నారాయణస్వామి, సౌరి , డేగా ప్రభాకర్, ప్రభృతులు పాల్గొన్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *