ఆశ్వయుజ శుద్ధ చవితి, ఆదివారము, శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాతస్స్మరామి లలితా వదనారవిందం
బింబాధరంపృథుల మౌక్తిక శోభినాసమ్ |
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాధ్యం
మందస్మితం మృగమదోజ్ఞ్యల ఫాలదేశమ్ ||

శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీదేవి గా దర్శనమిస్తారు. ఈ అమ్మవారు శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసితననికొలిచే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తున్నది. శ్రీ లక్ష్మీదేవి, శ్రీసరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూవుండగా చిరుమందహాసంతో, వాత్సల్య జితోష్నలను చిందిస్తూ, చెరకుగడను చేతపట్టుకొని శివుని వక్షస్థలంపై కూర్చొని శ్రీలలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగా, అమ్మవారు త్రిపురసుందరీదేవిగా భక్తులచేత పూజలందు కొంటున్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *