-దివాళ తీసింది ఆర్థిక వ్యవస్థ కాదు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలు, వారి పార్టీలు
-ప్రతి ఎన్నికల్లోనూ బాక్సులు బద్ధలయ్యేలా తీర్పునిచ్చినా చంద్రబాబుకు బుద్ధిరాలేదునాలుగో రోజు ఆసరా సంబరాలలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర మహిళలకు దసరా పండుగ ఆసరా రూపంలో వారం ముందుగానే వచ్చిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురం AKTPM పాఠశాలలో 31, 33, 36 డివిజన్ లకు సంబంధించి జరిగిన వైఎస్సార్ ఆసరా సంబరాలలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి లతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులచే ప్రదర్శింపజేసిన సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. తల్లి ప్రేమ, సోదరి ఆప్యాయత తెలిసిన వ్యక్తిగా, డ్వాక్రా మహిళల అప్పులను తీర్చే బాధ్యతను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన భుజాలపై వేసుకున్నారన్నారు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చే నాటికి డ్వాక్రా మహిళల రుణాలు రూ.14,200 కోట్లు ఉండగా.. ఎన్నికల వాగ్దానాన్ని చంద్రబాబు నిలబెట్టుకోలేకపోవడంతో 2019 ఏప్రిల్ 11 నాటికి ఆ రుణాలు అసలు, వడ్డీ కలుపుకొని రూ.25,517 కోట్లకు చేరాయన్నారు. అధికారం మత్తులో పడి ఐదేళ్లు మహిళా సంక్షేమాన్ని చంద్రబాబు పూర్తిగా విస్మరించారన్నారు. మళ్లీ 2019 ఎన్నికల సమయంలో మహిళలను మభ్యపెట్టేందుకు పసుపు-కుంకుమ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారన్నారు. కానీ విజ్ఞులైన మహిళలు బాక్సులు బద్ధలయ్యేలా 151-23 తీర్పునిచ్చారన్నారు. రాత్రి వరకు క్యూలైన్లలో నిలబడి మరీ చంద్రబాబుకు గట్టి బుద్ధిచెప్పారన్నారు.
అక్కచెల్లెమ్మల రుణం తీర్చుకున్న జగనన్న
చంద్రబాబు చేసిన తప్పులకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన డ్వాక్రా సంఘాలను బయట పడేసేందుకు ‘వైఎస్సార్ ఆసరా’ పథకానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. ఆసరాకి సంబంధించి నియోజకవర్గ పరిధిలో 3,415 గ్రూపులకు రూ. 29 కోట్ల 52 లక్షల 7వేల 991 రూపాయలు అందించినట్లు వివరించారు. తొలి విడతలో 3,251 గ్రూపులకు గానూ రూ. 28 కోట్ల 96 లక్షల 20వేల 320 రూపాయలు డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరినట్లు వెల్లడించారు. రెండు విడతలు కలుపుకుని దాదాపు రూ. 60 కోట్లను డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అందించడం జరిగిందన్నారు. 31 వ డివిజన్ లో రెండో విడతకు సంబంధించి 108 గ్రూపులకుగాను రూ. 79 లక్షల 91 వేల 622 రూపాయలు డ్వాక్రా మహిళల ఖాతాలలో జమ చేశామన్నారు. అదే విధంగా 33 వ డివిజన్ లో 67 గ్రూపులకు సంబంధించి రూ. 68 లక్షల 41 వేల 76 రూపాయలు, 36వ డివిజన్ కు సంబంధించి 114 గ్రూపులకు గానూ రూ. కోటి 13 లక్షల 23 వేల 445 రూపాయలను నేరుగా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూర్చామన్నారు. ప్రతి అక్కచెల్లెమ్మ వారి కాళ్లపై వారు నిలబడేలా ఐటీసీ, రిలయన్స్, అమూల్ లాంటి దిగ్గజ కంపెనీలను భాగస్వాములను చేస్తూ వ్యాపార మార్గాలను చూపించడం జరుగుతోందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుంటూ జీవనోపాధులు పెంపొందించుకోవాలని డ్వాక్రా మహిళలకు సూచించారు.
మరోవైపు వైఎస్సార్ నవశకం పేరుతో సంక్షేమ పథకాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మల్లాది విష్ణు అన్నారు. పాలన అంటే ఒక్క చోట కేంద్రీకృతం కాకూడదని.. గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా పరిపాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారన్నారు. కుల, మత, పార్టీకలతీతంగా శాచ్యురేషన్ పద్ధతిలో సంక్షేమాన్ని ప్రతిఒక్కరికీ చేరువచేశారన్నారు. 31, 33, 36 డివిజన్లకు సంబంధించి 5,055 మందికి వైఎస్సార్ బీమా, 156 మందికి వాహన మిత్ర, 247 మందికి టిడ్కో ఇళ్లు, 316 మందికి జగనన్న తోడు.. ఇలా సంక్షేమాన్ని ప్రతి గడపకూ చేరువ చేశామన్నారు.
టీడీపీ హయాంలో విచ్చలవిడిగా అప్పులు, దుబారా
చంద్రబాబు గద్దె దిగే నాటికి రాష్ట్రాన్ని రూ. 2 లక్షల 40 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టారని.. ఆ నిధులను ఎక్కడ, ఎందుకు ఖర్చు చేశారో ఇప్పటికీ చెప్పలేని స్థితిలో తెలుగుదేశం నాయకులు ఉన్నారని మల్లాది విష్ణు గారు అన్నారు. సింగపూర్, దావోస్, జపాన్ వంటి విదేశీ పర్యటనకు, పోలవరం సందర్శనలకు ఇష్టానుసారంగా రూ. వందల కోట్లను దుబారా చేశారన్నారు. చివరకు హెరిటేజ్ నీటి కొనుగోళ్లకు రూ. 16 కోట్ల నిధులను ఖర్చు చేశారన్నారు. తిరుమల తిరుమతి దేవస్థానం నిధులను సైతం ఢిల్లీలో దీక్షలకు, ధర్నాలకు దారి మళ్లించారన్నారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రూ. లక్షా 50 వేల కోట్లను పారదర్శకంగా ప్రజా సంక్షేమానికి ఖర్చు చేశారని మల్లాది విష్ణు గారు వెల్లడించారు. పేదవాడి ఆకలి తీర్చాలన్న తపనతో అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. నేడు రాష్ట్రంలో దివాళతీసింది ఆర్థిక వ్యవస్థ కాదని.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ఆలోచన విధానాలు, వారి పార్టీలు అని ఎద్దేవా చేశారు.
ఈబీసీ నేస్తానికి గడువులోగా దరఖాస్తు చేసుకోండి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదల ఆర్థిక స్వావలంబన దిశగా ఈబీసీ నేస్తం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మల్లాది విష్ణు అన్నారు. కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, వెలమతో పాటు ఇతర అగ్రవర్ణాలకు చెందిన పేద మహిళలు ఈ పథకానికి అర్హులని తెలియజేశారు. ఇందుకోసం బడ్జెట్ లో ఇప్పటికే రూ. 750 కోట్లు కేటాయించినట్లు తెలియజేశారు. ఈ నెల 7 నాటికి గడువు ముగిసినప్పటికీ.. మరో 4 రోజులు పొడిగించినట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతిఒక్కరూ చివరి రోజు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడమే లక్ష్యంగా చేపట్టిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ 100 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అధికారులు, పార్టీ శ్రేణులకు సూచించారు.
మరోవైపు శాంతిభద్రతలను కాపాడటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉందని మల్లాది విష్ణు అన్నారు. తెలుగుదేశం నాయకులు పోలీస్ వ్యవస్థను దూషించడం తప్ప.. వ్యవస్థను పటిష్ట పరిచేందుకు ఏనాడూ చర్యలు చేపట్టలేదన్నారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. వారికి అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇందులో భాగంగా గుణదల ప్రాంతానికి నూతన పోలీస్ స్టేషన్ ను మంజూరు చేస్తూ.. ఇటీవల జీవో నెం. 113 విడుదల చేయడం జరిగిందని గుర్తుచేశారు.
డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్క పొదుపు సంఘాల మహిళ మోముల్లో చిరునవ్వు చూడాలనే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలను సైతం మహిళల పేరుతోనే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని చెప్పుకొచ్చారు. అది చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటూ కోర్టులలో కేసులు వేస్తున్నారని మండిపడ్డారు.
స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం 1947 లో వస్తే, రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం 2019లో వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రతి మగవాడు ఈర్ష్య పడేలా మహిళలకు సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు కోర్టులలో ఎన్ని కేసులు వేసినా.. ఎక్కడా మాట తప్పకుండా, మడమ తిప్పకుండా పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు మెగా చెక్ ను ఎమ్మెల్యే గారి చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పెనుమత్స శిరీష, బాలిగోవింద్, ఉద్ధంటి సునీత, కో-ఆప్షన్ సుభ్యులు గుండె సుభాషిణి, నందెపు జగదీష్, మాజీ కార్పొరేటర్లు శిశ్లా రామలింగమూర్తి, నాగలక్ష్మి, సీఐ బాలమురళి కృష్ణ, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News