విద్యుత్ రంగంలో ఏర్పడిన సంక్షోభం తాత్కాలికమే…

-రాష్ట్ర ఇంధన ,అటవీ, పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ వ్యాప్తంగా ఏర్పడిన బొగ్గు కొరత దృష్ట్యా మన రాష్ట్ర విద్యుత్ రంగంలో నెలగొన్న తాత్కాలిక ఒడిదుడుకులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర ఇంధన ,అటవీ, పర్యావరణ శాఖల మంత్రి  బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏదో ఒక స్థాయిలో విద్యుత్ కొరతను ఎదురుకుంటున్నాయిని , మన రాష్ట్రం లో ఏర్పడిన సంక్షోభం తాత్కాలికమేనని తెలిపారు
విద్యుత్ రంగంలో ఎదురవుతున్న ప్రస్తుత సంక్షోభం విషయమై ముఖ్య మంత్రి స్పందించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ప్రెత్యేకంగా లేఖ రాసారని మంత్రి గుర్తు చేశారు. ఈ విషయం పై అధికారులతో నిరంతరం సమీక్షిస్తూ , ఈ పరిస్థితిని గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి ఎప్పటికపుడు చర్యలు తీసుకుంటున్నారు. వినియోగదారులకు కలిగే అసౌకర్యాన్ని సాధ్యమైనంత త్వరగా తొలగించేందుకు అవసరమైన చర్యలాని తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు గత రెండేళ్ల కాలంలో రాష్ట్రపభ్రుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఫలితంగా విద్యుత్ రంగంలో పజ్రాధనాన్ని పెద్దఎత్తున ఆదా చేసిన రాష్ట్రంగా ఆంధ ప్రద్రేశ్ ప్రశంసలను అందుకుందని మంత్రి తెలిపారు .కోవిడ్ తరువాత దేశ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం 2019 తో పోలిస్తే 2021 లో 18 శాతం పెరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లో 20 శాతం పెరిగింది. కోవిడ్ ఒక వేళ లేకపోయినట్లయితే జరిగుండే అభివృధ్ది శాతం కన్నా ఇది 8 శాతం అదనంగా వినియోగం జరుగుతుందన్నారు
ఆంధ్రప్రదేశ్ లో రోజుకి సగటున 160 మీ. యూనిట్లు 2019 అక్టోబరులో వినియోగిస్తే 2021 అక్టోబరులో రోజుకి సగటున 190 మీ యూనిట్లు వినియోగిస్తున్నారు. రోజుకు దాదాపు 15 మి.యు. అదనంగా వినియోగం జరుగుతోందన్నారు.దేశ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొనివున్న బొగ్గు కొరత కారణంగానే మన రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో కూడా బొగ్గు నిల్వలు నిండుకున్నాయి తప్ప ఇంధన శాఖ వైఫల్యం వల్ల ఈవిధంగా జరిగింది అనే ఆరోపణ నిజం కాదన్నారు
ఆంధ్ర ప్రదేశ్ జెన్కో కు చెల్లించాల్సిన విద్యుత్ కొనుగోలు వ్యయం మొత్తం గత రెండున్నర సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు చెల్లించడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు సమయానుగుణంగా చెల్లించాల్సిన బకాయిలు చెల్లించని కారణంగానే బొగ్గు నిల్వలను పెంపొందించుకోలేదని అనటం వాస్తవం కాదు. గత ఏడు సంవత్సరాలుగా ఆంధ్ర ప్రదేశ్ జెన్కో కు చేసిన చెల్లింపులు ఈ విధంగా వున్నాయి.
జెన్కో కు గత రెండున్నర సంవత్సరాలలో దాదాపు రూ 8000 కోట్లు అదనపు చెల్లింపులు చేయటం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వ నియంత్రణ లో వున్న బొగ్గు మరియు రైల్వే వ్యవస్థలలో, వర్షాల కారణంగా ఉత్పత్తి మరియు సరఫరాలో వచ్చిన అంతరాయాలు వలన మరియు దిగుమతి చేసుకునే విదేశీ బొగ్గు యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోవటం వలన బొగ్గు కొరత ఏర్పడుతోంది తప్ప, జెన్కో కు నిధుల కొరత వలన బొగ్గు కొనలేక పోతున్నది అనటం పూర్తిగా అవాస్తవం అని తెలిపారు
జెన్కో కేంద్రాలను అనాలోచితంగా మూసివేయటం జరగ లేదని మంత్రి స్పష్టం చేసారు . బహిరంగ మార్కెట్టులో జెన్కో కేంద్రాల చర వ్యయం కంటే తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో వున్నప్పుడు మాత్రమే విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడం కోసం మార్కెట్ వేలం నుంచి విద్యుత్ కొనుగోలు చేసినట్లు తెలిపారు.
బొగ్గు కొరత దృష్ట్యా యూనిట్లను పూర్తి స్థాయిలో నడపలేని పరిస్థితిని దృష్టి లో ఉంచుకొని , ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్( ఆర్ టీ టీ పీ ) లో వార్షిక మరమ్మతుల పనులు చేపట్టడం జరిగింది. ఒకవేల వీటిలో వార్షిక మరమ్మతుల పనులు చేపట్టకపోయినప్పటికీ బొగ్గు కొరత దృష్ట్యా వాటిని మూసివేయాల్సి వచ్చిందన్నారు .ప్రస్తుతం ఆర్ టీ టీ పీ లోని 2 , 6 యూనిట్లలో వార్షిక మరమ్మతులు చేపట్టడం జరిగింది. బొగ్గు కొరత దృష్ట్యా 4 వ యూనిట్లో ఉత్పత్తి నిలిపివేయటం జరిగింది . ఎన్టీటీపీఎస్లో 2వ యూనిట్లో వార్షిక మరమ్మతుల పనులు నిర్వహించడం జరుగుతుంది.
మిగిలిన యూనిట్లలో బొగ్గు కొరత దృష్ట్యా వాటి పూర్తి సామర్థ్యం కంటే తక్కువ స్థాయి లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కృష్ణ పట్నం ఒకటి , రెండు యూనిట్లలోనూ బొగ్గు కొరత దృష్ట్యా వాటి పూర్తి సామర్థ్యం కంటే తక్కువ స్థాయి లో ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం విద్యుత్ ఉత్పతి సామర్థ్యంలో థర్మల్ , గ్యాస్ , సౌర విద్యుత్, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి , జల విద్యుత్ ఉత్పత్తి కలిసి ఉన్నాయి . తెలంగాణ రాష్ట్రంలో సహజ సిద్ధంగా బొగ్గు గనులు ఉన్న దృష్ట్యా ఆ రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా ఉంది .
తెలంగాణ రాష్ట్రం తమ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా ఆ రాష్ట్రంలోని సింగరేణి గనుల నుంచి ఏ పీ జెన్కో థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా జరగటం లేదు . ఈ దృష్ట్యా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తీవ్ర బొగ్గు కొరత ఎదుర్కొంటున్నప్పటికీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 5 నుంచి 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. అలాగే జూరాల , శ్రీశైలం , నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రాలనుంచి 2000 మెగా వాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ మాత్రం కేవలం శ్రీశైలం రిజర్వాయర్ నిండినపుడు మాత్రమే జల విద్యుత్ ఉత్పత్తి చేసే పరిస్థితి ఉంది.
.ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం 18533 విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా దానిలో 8075 మెగావాట్లు ఉత్పత్తి కోసం సౌర, పవన విద్యుత్ వనరుల మీద ఆధారపడాల్సి ఉంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వీటి నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగటం లేదు.ఆంధ్ర ప్రదేశ్ థర్మల్ విద్యుత్ కెపాసిటీ 5010 మెగావాట్లు గా ఉంది. ఈ థర్మల్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గును సమకూర్చేందుకు కోల్ ఇండియా , సింగరేణి సంస్థలతో పాటు విదేశాల నుంచి దిగుమతుల పై కూడా ఆధారపడవల్సి వస్తుంది. ఇలా సమకూర్చుకున్న బొగ్గు మన థర్మల్ ప్లాంట్ల మొత్తం అవసరాలలో 70 నుంచి 75 శాతం తీర్చగలుగుతాయి.
రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 908 మెగావాట్లు ఉన్నపటికీ కేవలం 100 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయటానికి మాత్రమే గ్యాస్ అందుబాటులో ఉంటుంది. గ్యాస్ ప్లాంట్ల నుండి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయటానికి గ్యాస్ లభ్యత లేదు. అలాగే విశాఖపట్నంలోని 1040 మెగావాట్లు సామర్థ్యం గల హెచ్ ఎన్ పీ సీఎల్ వ్యవహారం సుప్రీమ్ కోర్ట్ లో ఉంది. మన రాష్ట్రంలోని డిస్కాములకు 63070 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా వాటికి ఉన్న దీర్ఘకాలిక వనరుల నుంచి 50 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే లభ్యం అవుతుంది. దీనిలో ఏపీ జెన్కో థర్మల్ , బొగ్గు, జల , పవన విద్యుత్, సౌర విద్యుత్ అన్ని కలిపి 50 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ డిస్కాములకు లభ్యమవుతుంది.
మన రాష్ట్రంలో 20130 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, దీనిలో 1600 మెగావాట్లు కృష్ణపట్నం నుంచి, 600 మెగావాట్లు ఆర్ టీ టీ పీ నుంచి , 1040 మెగా వాట్లు హెచ్ ఎన్ పీ సి ఎల్ నుంచి , 400 మెగావాట్ల కె ఎస్ కె నుంచి 7000 మెగా వాట్లను సౌర పవన ఇతర విద్యుత్ వనరుల నుంచి లభ్యమవుతుంది . ప్రస్తుతం నెలకొన్న బొగ్గు కొరత సంక్షోభం లేకుంటే పైన పేర్కొన్న విద్యుత్ ఉత్పత్తి వనరులు రాష్ట్ర అవసరాలను తీర్చగలుగుతాయి . మన రాష్ట్రంలో 2018 అక్టోబర్ లో కూడా ఇటువంటి బొగ్గు కొరత సంక్షోభం ఏర్పడింది. అపుడు కూడా రాష్ట్రం లో కొన్ని చోట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి డిస్కాములు బయట నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసాయి.
మన దేశంలో థర్మల్ కేంద్రాలకు రోజువారీ సరఫరా అవ్వాల్సిన బొగ్గులో ప్రస్తుతం రోజుకు 80 వేల మెట్రిక్ టన్నులు తక్కువగా సరఫరా అవుతుంది . బొగ్గు కొరత ఎదురుకొంటున్న థర్మల్ ప్లాంట్లు దేశ వ్యాప్తంగా అక్టోబర్ 1 , 2020 నాటికీ 14 ఉండగా , ఈ ఏడాదికి అదే తేది నాటికి 104 కి చేరాయి. అలాగే అక్టోబర్ 7, 2020 నాటికీ బొగ్గు కొరత ఎదుర్కొంటున్న ప్లాంట్లు 14 ఉండగా, ఈ ఏడాది అదే తేదికి 110 కి చేరాయి. దీనివల్ల ఏ పీ జెన్కో కేంద్రాలలో కూడా బొగ్గు సరఫరా తగినంతగా లేదు . ఫలితంగా రోజుకు 3700 మెగావాట్ల ఉత్పత్తి చేయవల్సిన ఏ పీ జెన్కో ప్లాంట్లు ఇప్పుడు 2000-2200 మెగావాట్ల మధ్య విద్యుత్ ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. దీనివల్ల రోజుకు 1500 ఉంచి 1700 మెగావాట్ల వరకు డెఫిసిట్ ఉంటుంది . దేశ వ్యాప్తంగా బొగ్గు సరఫరా మెరుగుపడటానికి మూడు నెలల సమయం పట్టనునట్లు తెలుస్తుంది.
జెన్కో బొగ్గు ప్లాంటులకి రోజుకు ఇంచుమించు 70,000 టన్నుల బొగ్గు అవసరం కాగా, సెప్టెంబరు నెల ఆఖరులో రోజుకు 24,000 టన్నులు మాత్రమే బొగ్గు అందుబాటులోఉండేది. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరిన మీదట అది ప్రస్తుతం రోజుకు 40,000 టన్నులకి పెరిగింది. నిజానికి ఇటీవల మనం ఏ పీ ఈ ఆర్ సి నిర్ణయించిన ధర కన్నా తక్కువ ధరకే బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయటం, ఇతరేతర తీసుకున్న చర్యల వల్ల సుమారు రూ 2,300 కోట్లు రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆదా చేసిన విషయం అందరికి తెలిసిందే అని మంత్రి పేర్కొన్నారు
రాష్ట్ర విద్యుత్ సంస్థలను ఆదుకోవడానికి గత రెండు సంవత్సరాలలో ప్రభుత్వం చేయగలిగినంత సహాయం చేసిందని మంత్రి వివరించారు .. ప్రభుత్వం దాదాపు రూ 34340 కోట్లు ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న విషయం అందరికి తెలిసిందే. కేవలం కృష్ణ పట్నం విద్యుత్ ప్లాంటుకే రూ.9165 కోట్లు చెల్లించడం జరిగింది. మార్చి 2019 నాటికి రూ 27,239 కోట్లు ఉన్న విద్యుత్ సంస్థల మొత్తం నష్టాన్ని, మార్చి 2021 నాటికి రూ 27,552 కోట్ల వద్దనే నిలువరించడమ్ జరిగింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో విద్యుత్ సబ్సిడీ సెప్టెంబరు నాటికి చెల్లించవలసిందంతా ప్రభుత్వం చెల్లించివేసింది అని మంత్రి తెలిపారు.
ఏ పీ డిస్కాములు 2014-2019 మధ్య కాలంలో , ఏపీ జెన్కో , ఏ పీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకు రూ 56904 కోట్లు చెలించాల్సి ఉండగా రూ 43048 కోట్లు మాత్రమే చెల్లించాయి. ఇంకా చెల్లించాల్సిన మొత్తం రూ 13866 కోట్లుగా ఉంది.
అలాగే 2020-21 సెప్టెంబర్ నాటికీ డిస్కాములు రూ 30883 కోట్లు చెలించాల్సి ఉండగా రూ 33054 కోట్లు చెల్లించాయి. దీని వల్ల 2014-19 మధ్య కాలంలో డిస్కాములు చెల్లించాల్సిన రూ 13866 కోట్లలో రూ 11695 కోట్లు మొత్తాన్ని ప్రస్తుతం(2020- 2021 సెప్టెంబర్ మధ్య కాలంలో ) చెల్లించటం జరిగింది . ఇప్పుడు ఈ అక్టోబర్ నెలనాటికి డిస్కాములు చెల్లించాల్సిన మొత్తం రూ 2170 కోట్లు మాత్రమే.రాష్ట్రంలోని విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలియచేసారు .

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *