శ్రీశక్తి పీఠం అమ్మవారికి ప్రత్యేక పూజలు…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రాణిగారి తోటలో గల శ్రీశక్తి పీఠం వద్ద దసరా నవరాత్రి పర్వదినం సందర్భంగా ఘనంగా నిర్వహిస్తున్న ఉత్సవాలలో మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అమ్మవారి చల్లని దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, ఆ విజయ దుర్గమ్మ ఆశీస్సులతో చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని ప్రార్దించినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రా కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు,నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *