కొవ్వూరు (కుమారదేవరం), నేటి పత్రిక ప్రజావార్త :
కుమారదేవరం, చిడిపి, అరికరేవుల గ్రామాల్లోని 188 స్వయం సహాయక సంఘ మహిళా సభ్యుల ఖాతాలో రూ.159 లక్షల 71 వేల వైఎస్సార్ ఆసరా రెండో విడత సొమ్మును జమచెయ్యడం జరిగిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మంగళవారం కుమారదేవరం గ్రామంలో వైఎస్సార్ ఆసరా రెండో విడత నగదు బదిలీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తే , ఆయా కుటుంబాలు ఆర్ధిక పురోగతి సాధ్య మని బలంగా నమ్మిన వ్యక్తి మన సీఎం జగనన్న ఒక్కరే అని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ఆ దిశలోనే ప్రతి ఒక్క పథకంలోను మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. పౌష్టికాహారం పధకానికి గతంలో ఏడాదికి రూ.500 కోట్లు ఖర్చు చేస్తే, జగనన్న రూ.1800 కోట్లు ఏటా ఖర్చు చేస్తున్నాము. మన బిడ్డల కోసం మేనమామ గా ఆలోచించి, ఎన్నో పధకాలను ప్రకటించడం, అమలు చేసి అండగా ఉంటున్నారు. రాష్ట్రంలో18 దిశా పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేసి మహిళలకు భరోసా తో భద్రత కల్పించడం జరిగింది. ఆర్ధిక తోడ్పాటు తోపాటు రాజకీయంగా, సామాజికంగా ఎదిగేందుకు రాజకీయ, నామినేటెడ్ పదవులు, పనుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు మహిళలకై అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న మాత్రమే అన్నారు.
వైఎస్సార్ ఆసరా కింద కొవ్వూరు మండలం లోని 1325 గ్రూపుల్లోని స్వయం సహాయక సభ్యులకు 4 విడతల్లో రూ.40 కోట్ల 43 లక్షలు ప్రయోజనం కలుగ చేస్తున్నామన్నారు. కుమారదేవరం గ్రామంలో 80 గ్రూపులకు రూ. 74 లక్షలు, చిడిపి గ్రామంలో 38 గ్రూపులకు రూ.30 లక్షలు, అరికరేవుల గ్రామంలో 73 గ్రూపులకు రూ. 55 లక్షలు స్వయం సహాయక సంఘ మహిళా సభ్యుల ఖాతాలో మొత్తం రూ.159 లక్షల 71 వేల వైఎస్సార్ ఆసరా రెండో విడత సొమ్మును జమచెయ్యడం జరిగిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. హామీలకు కట్టుబడి రుణమాఫీ చేయడం జరుతోందన్నారు. రుణమాఫీ మొత్తాలను మీ కుటుంబాల ఆర్థికాభివృద్ధి కోసం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. మీ కుటుంబాల కు మహిళ లే కుటుంబ యజమానులు గా, ప్రధాన ఆధారంగా ఉండాలని వారి పేరునే ఇళ్ల పట్టాలు అందిస్తున్నట్లు మంత్రి తానేటి వనిత తెలిపారు. వైఎస్సార్ ఆసరా రెండో విడత సంబరాలు దసరా పండుగ రోజుల్లో అందచేసే క్రమంలో మీ గ్రామానికి వొచ్చామన్నారు. మీ ఆనందానికి కారణం ఎవరు, ఇచ్చిన హామీలను అమలు చేసేది ఎవరు అని ప్రశ్నించాగా, పెద్ద ఎత్తున మహిళలు జగనన్న అని నినాదాలు చేశారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీమీ కుటుంబాల ఆర్ధిక అభివృద్ధి కి వినియోగించుకొవాలని కోరారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు వేస్తే తాను రెండడుగులు వేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. దిశా చట్టం ఆమోదం కేంద్రం వద్ద పెండింగులో ఉండగా, దిశా యాప్ ద్వారా మహిళల భద్రతకు చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇటువంటి ముఖ్యమంత్రి ని భవిష్యత్తు తరాలకు అందించాల్సి ఉంది. మీకు అడుగడుగునా అండగా, తోడుగా నిలుస్తున్న జగనన్నను 2019 లో ఇచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ స్థానాలు 2024 లో కూడా ఇచ్చి మనకోసం మరిన్ని సంక్షేమ పథకాలు అమలుకు అవకాశం ఇద్దామని పేర్కొన్నారు.
తొలుత కుమారదేవరం కూడలిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.గర్భిణి స్త్రీలకు సీమాంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సభా ప్రాంగణంలో జ్యోతిప్రజ్వలన చేసి, వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. తదుపరి వై ఎస్ ఆర్ ఆసరా రెండో విడత చెక్కును అందచేశారు. కొవ్వూరు ఎంపిపి కాకర్ల నారాయుడు, జడ్పిటిసి బి. అనంతలక్ష్మి, సర్పంచ్ కుమారదేవరం కాశాని దుర్గ, అరికిరేవుల మట్టా శ్రీను, చిడిపి పి. లక్ష్మణరావు, ఏ ఎంసి చైర్మన్ వల్లభశెట్టి శ్రీనివాసరావు, ఎంపిటిసి లు అల్లు అమరావతి, నడిపల్లి అప్పారావు, వై. నటరాజరాణి, చాగల్లు ఎంపిపి వీరాస్వామి, ఎంపిడిఓ పి.భ్రమరాంబ, తహసీల్దార్ బి. నాగరాజు నాయక్, ఏరియా కో ఆర్డినేటర్ మధు, స్థానిక ప్రజాప్రతినిధులు గౌరు శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ, రామకృష్ణ, వి.ఓ.లు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.