వీధులను పాదాచారులకి అనువుగా మరియు ఆహ్లాదకరముగా తీర్చిదిదుటయే లక్ష్యంగా స్ట్రీట్ ఫర్ పీపుల్…

-సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్
-పైలట్ ప్రాజెక్ట్ గా ఎన్.ఆర్.రోడ్ – మరిన్ని ప్రదేశాలను ఆహ్లాదపరచుటకు ప్రతిపాదనలు
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
స్ట్రీట్ ఫర్ పీపుల్ కార్యక్రమములో భాగంగా కమర్షియల్ కేటగిరీలో ప్రజలకు అనువైన ప్రదేశంగా తీర్చిదిద్దిన సత్యనారాయణపురం ఎన్.ఆర్.పి రోడ్ ను మంగళవారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శ్రీ శైలజా రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ మరియు అధికారులతో కలసి ప్రారంభించారు.
సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యలు మల్లాది విష్ణు మాట్లాడుతూ స్ట్రీట్ ఫర్ పీపుల్ ఛాలెంజ్ అనేది స్మార్ట్ సిటి మిషన్, హోసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖా, భారత ప్రభుత్వం, ITDP ఇండియా ప్రోగ్రమ్ బాగస్వామ్యంతో నిర్వహించబడుతున్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము నగరములోని కొన్ని వీధులను పాదాచారులకి అనువుగా మరియు ఆహ్లాదకరముగా తీర్చిదిదుట మరియు నిరుపయోగముగా ఉన్న కొన్ని ప్రాంతాలను బాగుపరచి ఉపయోగకారముగా మర్చిసుందరీకరించుట. ఈ ప్రాజెక్ట్ నగరంలోని రద్దీ రోడ్లను అనువైన విధముగా మార్చికొని వాడుకొనుటకూ (మల్టీయుటిలిటీ జోన్లు, పార్కింగ్ ప్రదేశములు, పాదచారుల నడక దారులను ప్రతిపాదించుకొని అమలపరుచుటకు ) మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇటువంటి పైలట్ ప్రాజెక్ట్ లు అమలు పరుచుట వల్ల పాదచారులు మరియు ట్రాఫిక్ సమస్యలకు సులభమైన జీవన పరిష్కారాలు చూపి ప్రజల ఇబంధులు తొలగుతాయని అన్నారు. ఈ విధమైన ప్రాజెక్టులు నగరంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరింప చేసి ప్రజలు సమస్యలు పరిష్కరిస్తారు అని ఆశిస్తూ, నగరపాలక సంస్థ వారికీ అభినందనలు తెలియజేసారు. .
నగర మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్లేస్ మేకింగ్ మరియు నివాస యోగ్యత పై దృష్టి సారించి నగరాల్లో ఫ్లాగ్ షిప్ వాకింగ్ చొరవలను సృష్టించడం ఈ ఛాలెంజ్ లక్ష్యం. ప్రాజెక్ట్ నందు కమర్షియల్ కేటగిరీలో – సత్యనారాయణపురం ఎన్.ఆర్.పి రోడ్ మరియు రెసిడెన్షియల్ కేటగిరిలో వాంబే కాలనీ లను ఎంపిక చేసినట్లు ఆమె వివరించారు. ఈ ఛాలెంజ్ యొక్క ముఖ్య ఉద్దేశము నగరములోని కొన్ని వీధులను పాదాచారులకి అనువుగా మరియు ఆహ్లాదకరముగా తీర్చిదిదుటే అని పేర్కొన్నారు. తదుపరి పైలట్ ప్రాజెక్ట్ క్రింద వాంబేకాలనీలో అమలు పరచటకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విధమైన ప్రతిపాదనలు నగరమలోని మరిన్నిప్రాంతములకు విస్తరించడానికి తగిన ప్రణాళిక సిద్ధం చేస్తామని వివరించారు.
స్థానిక ప్రజలు ఈ ప్రాజెక్టుని ఆదరించాలని, మన అందరం కలిసి ప్రాజెక్ట్ విజయవంతం చేసి నగరంలో మరిన్ని ప్రదేశాలని సుందరంగా ఆహ్లాదకరoగా అభివృద్ధి పరుచుటకు నగరపాలక సంస్థ సహకరించాలని డిప్యూటీ మేయర్ విజ్ఞాప్తి చేసారు.
కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్ వల్లూరి ఎన్.డి.ఎస్. మూర్తి, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్, మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *