అగ్నిప్రమాద భాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు, సబ్ కలెక్టర్ సాయి సూర్య ప్రవీణ్ చంద్ర…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్నిప్రమాద భాధితులను మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు, సబ్ కలెక్టర్ సాయి సూర్య ప్రవీణ్ చంద్ర పరామర్శించారు. జి కొండూరు మండలం గుర్రాజుపాలెం గ్రామానికి చెందిన చింతగింజల వెంకటేశ్వరరావు కు చెందిన పూరిల్లు ప్రమాదవశాత్తు కాలిపోవడంతో పూర్తిగా నిరాశ్రయిలైయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు, సబ్ కలెక్టర్ తో కలిసి వచ్చి జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు. తన వంతుగా దాతృత్వం చాటుకుని ఆర్థిక సహయం అందజేశారు. ప్రభుత్వం తరుపున ఇళ్ల స్థలం పక్కాగృహాం తో పాటు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ వెంకట్రామయ్య, స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విత్తనం నాటిన ప్రతి రైతుకు ఫసల్ బీమా

-రైతుల ఆర్థిక భద్రతకు 100 శాతం ఫసల్ బీమా నమోదు -ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద విత్తనం నాటిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *