విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైస్సార్సీపీ నాయకులు కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా పర్యవేక్షణ చేయడంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా సామాజిక సేవ కార్యక్రమలు చేపట్టడం అభినందనైయం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం తూర్పు నియోజకవర్గం దర్శిపేట నందు స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్య దాదాపు లక్ష రూపాయల తన సొంత నిధులతో సిద్ధం చేయించిన టిఫిన్ బండ్లు, తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు వాటిని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా సాంబయ్య నాడు ప్రతి రోజు పేదలకు కూరగాయలు, నిత్యవసర వస్తువులు పంపిణీ చేసారని,కార్పొరేటర్ అయిన తరువాత డివిజిన్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తున్నారు అని,అదేవిధంగా ఇలా తన సొంత నిధులతో పేదలకు జీవనోపాధి కల్పించడం గొప్ప విషయం అని కొనియాడారు. సామాజిక సేవ కార్యక్రమలలో వైస్సార్సీపీ నాయకులు ఎల్లప్పుడూ ముందు ఉంటున్నారని వారికి తన సహాయసహకారాలు ఎప్పుడు ఉంటాయని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శెటికం దుర్గాప్రసాద్,వైసీపీ నాయకులు రామాయణపు శ్రీనివాసు, చిమటా బుజ్జి, గోవర్ధన్ రావు, మల్లి, శీలం ప్రతాప్, నరేష్, రాజేష్, అనిల్, అప్పారావు, విజయ్, తిరుపతి, సిద్ధయ్య మరియు డివిజన్ కార్యకర్తలు పాల్గొన్నారు
