Breaking News

గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధముగా మహిళలకు ఆర్థిక భరోసా… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రతి మహిళా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సాదరికతకు కృషి చేస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం స్క్రూ బ్రిడ్జి వద్ద పాత విబియన్ కాలేజ్ గ్రౌండ్లో జరిగిన 9,15,16,19 డివిజిన్ల రెండవ విడత వైయస్సార్ ఆసరా పథకం లబ్ధిదారులతో జరిగిన ఆసరా సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ ఆయా డివిజన్ ల పరిధిలో 697 గ్రూపులకు మంజూరు అయిన 7కోట్ల 62లక్షల రూపాయల నమూనా చెక్కును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రతి పధకంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్న ఘనత వైస్సార్సీపీ ప్రభుత్వం దే అని, అదేవిధంగా దిశ ఆప్, దిశ చట్టం తీసుకొచ్చి వారి రక్షణ కు కృషి చేస్తున్నాం అని తెలిపారు. ఇళ్ల స్థలాలు మహిళలు పేరు మీద ఇచ్చి వారి సొంతింటి కలను నిజం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తూ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఒకసారి ప్రజలలోకి వచ్చి ప్రభుత్వం పాలన పట్ల వారు ఎంత సంతోషం గా ఉన్నారో చూడాలని,అంతేగాని ఇళ్లలో కూర్చొని అదేపనిగా విమర్శలు చేయడం తగదని హితవుపలికారు. సంక్షేమ పథకాలను ఉపయోగించుకొని ప్రతి మహిళా లక్షాధికారి కావాలని ప్రభుత్వం మీకు అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 16 వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మిడిశెట్టి రాధికా,19 వ డివిజన్ కార్పొరేటర్ రెహానా నాహిద్, 3 వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక, కో ఆప్షన్ మెంబెర్ సయ్యిద్ అలీమ్, 9 వ డివిజన్ ఇంచార్జ్ ఈశ్వర్ ప్రసాద్ వైసీపీ సీనియర్ నాయకులు ఉమ్మిడి శెట్టి బహుదూర్, దామోదర్, నాహిద్, గల్లా రవి మరియు నాలుగు డివిజన్ల వైసీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై కొలువైన అమ్మవారిని మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *