వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఇంజినీరింగ్, ఫార్మశీలలో ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదల…

-ఈనెల 30వ తేదీవరకూ ఆన్ లైన్ ద్వారా ఫీజు చెల్లింపు, ధరఖాస్తుల స్వీకరణ…
-నవంబరు 10వ తేదీ నాటికి విద్యార్థులకు సీట్ల కేటాయింపు పూర్తి…
-నవంబరు 15 నుండి తరగతులు ప్రారంభం…
-రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మశీ కాలేజీలలో కన్వీనర్ కోటా క్రింద ఈ రోజు వరకూ 81,597 సీట్లు అందుబాటులో
ఉన్నాయి…
-రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మశీ కోర్స్ లకు సంబంధించి ఆన్ లైన్ అడ్మిషన్ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
విజయవాడ గేటు హోటల్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో APEAPSET-2021 అడ్మిషన్ వెబ్ కౌన్సిలింగ్ కు సంబంధించి గురువారం సాంకేతిక విద్యాశాఖ కమిషనరు పోలా భాస్కర్‌తో కలిసి మంత్రి ఆదిమూలపు సురేష్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మశీ కాలేజీల్లో ప్రవేశాలు కొరకు నిర్వహించిన APEAPSET-2021 ఎ ంట్రన్స్ టెస్ట్ కు ఒక లక్షా 66 వేల 460 మంది పరీక్షకు హాజరుకాగా, ఒక లక్షా 34 వేల 205 మంది విద్యార్థులు ఎ ంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని మంత్రి అన్నారు. ఇందుకు సంబంధించి ప్రవేశాలకొరకు ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ కొరకు ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ద్వారా ఫీజులు చెల్లించుటకు ఈనెల 25 నుండి 30వ తేదీవరకూ, ఈనెల 26 నుండి 31వ తేదీవరకూ హెల్ప్ లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారని, నవంబరు 1వ తేదీ నుండి 5వ తేదీవరకూ వెబ్ ఆప్షన్స్ కొరకు అభ్యర్థులు రిజిష్టరు చేసుకోవచ్చునని, నవంబరు 6వ తేదీన ఆప్షన్ మార్చుకొనుటకు అవకాశం కల్పించామని, నవంబరు 10వ తేదీన ఇంజినీరింగ్, ఫార్మశీ సీట్లను కేటాయిస్తారని, నవంబరు 10 నుండి 15వ తేదీవరకూ వారికి కేటాయించిన కాలేజీల్లో జాయినింగ్ ప్రక్రియ నిర్వహిస్తారని, నవంబరు 15 నుండి విద్యార్ధులకు క్లాస్లు ప్రారంభమవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఆన్ లైన్ అడ్మిషన్ కు సంబంధించి 25 హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఈ సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారని మంత్రి అన్నారు. వెబ్ కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్ధులు APEAPSET-2021 ర్యాంకు కార్డు, హాల్ టెక్కెట్టు, యస్యసి మార్క్స్ మెమోరాండం, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోరాండం, 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకూ స్టడీ సర్టిఫికెట్లు, టిసి, ఇన్ కం సర్టిఫికెట్, రిజర్వేషన్ విద్యార్ధులకు కులధృవీకరణ పత్రం, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు ఇబిసి సర్టిఫికెట్, నేటివిటీ సర్టిఫికెట్, తదితర ధృవీకరణ పత్రాలు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా 35 శాతం ఇంజినీరింగ్, ఫార్మశీ సీట్లను కన్వీనర్ కోటా క్రింద కేటాయించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 25 ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు, 9 ఫార్మశీ, 2 ఫార్మా-డి కళాశాలలు ఉన్నాయని వీటిలో మొత్తం 6747 సీట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి అన్నారు. 4 ప్రైవేట్ యూనివర్సిటీలలో 2330 సీట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి అన్నారు. 297 ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మశీ, ఫార్మా-డి కళాశాలల్లో 72520 సీట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
వెబ్ కౌన్సిలింగ్ కు సంబంధించి విద్యార్ధులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 25 హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, కన్వీనర్ ఆఫీస్ ఇ-మెయిల్ ఐడి convenerapeapcet2021@gmail.com కు గానీ, ఫోన్ నెంబర్లు 8106876345, 8106575223, 1995865456 కు గానీ ఫోన్ చేసి విద్యార్థులు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని మంత్రి
ఆదిమూలపు సురేష్ అన్నారు. కన్వీనర్ కార్యాలయంలో సమాచారం పొందగోరేవారు (కార్యాలయం చిరునామాః- ది కన్వీనర్, ఏపి ఇఏపి సెట్- 2021 అడ్మిషన్స్, ఫ్లాట్ నెం. 104, ఏయన్ ఆర్ టవర్స్, జమ్మి చెట్టు వీధి, ప్రసాదంపాడు, విజయవాడ-521 108) లో సంప్రదించవచ్చునని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనరు పోలా భాస్కర్, జాయింట్ డైరెక్టరు ఏ. నిర్మల్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ సుధీర్ రెడ్డి, చీఫ్ క్యాంప్ ఆఫీసర్ బి.కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *