సమాజ సేవ ప్రతిఒక్కరి బాధ్యత : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-ఎమ్మెల్యే చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు, చిన్నారులకు వ్రాత పుస్తకాల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్లిష్ట సమయంలో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేయూతనందించడం అభినందనీయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58వ డివిజన్ ఇందిరానాయక్ నగర్ లో జాతీయ ఉత్తమ పోస్ట్ మెన్ అవార్డు గ్రహీత రామచంద్రరావు ఆధ్వర్యంలో సోమవారం పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు, పండ్లు, విద్యార్థులకు వ్రాత పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు  మాట్లాడుతూ నలుగురికి సాయపడే విధంగా నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న రామచంద్రరావు ని ప్రత్యేకంగా అభినందించారు. శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు, చిన్నారులకు వ్రాత పుస్తకాలు అందజేయడం హర్షణీయమన్నారు. సమాజ సేవను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రజల అవసరాలను, సమస్యలను గుర్తించి మానవతా దృక్పథంతో ఆదుకోవాలని పిలుపునిచ్చారు. మన ఎదుగులలో కీలక పాత్ర పోషించిన సమాజానికి తిరిగి సేవ చేయవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అప్పుడే సమాజాభివృద్ధి సాధించడానికి వీలు అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో చుక్కపల్లి సంకేత బాబు, చుక్కపల్లి అవినాష్, ఎల్.శంకర్ రాజు, వై.శ్రీనివాసరెడ్డి, అవుతు శ్రీనివాసరెడ్డి, ధనరాజ్, రిటైర్డ్ ఎస్సై ప్రసాద్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *