క్రీడాకారుల ప్రతిభకు ప్రోత్సహం అవసరం..

-అవకాశాలను అందిపుచ్చుకుని అంతర్జాతీయ క్రీడాకారులుగా రానించాలి..
-కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్‌కు ఊపు..
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడాకారులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాన్ని అందిపుచ్చకుని అంతర్జాతీయ క్రీడాకారులుగా రానించేందుకు కషి చేయాలని వాటర్ స్పోర్ట్స్ యువతలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని పర్యాటక రంగ అభివద్ధికి ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. వాటర్ స్పోర్ట్స్‌లో యువతను ప్రోత్సహించేందుకు జిల్లా క్రీడా సంస్థ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పున్నమి ఘాట్ వద్ద కష్ణానదీలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న వాటర్ స్పోర్ట్స్ పోటీలను శనివారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కష్ణానదీ తీర ప్రాంతంలో నిర్వహిస్తున్న వాటర్ స్పోర్ట్స్ యువక్రీడాకారులలో నూతన ఉత్సహాన్ని నింపడంతో పాటు పర్యాటకులకు వినోదాన్ని అందించడం అభిందనీయమన్నారు. వినోదంతో కూడిన సాహస క్రీడాలపై యువతలో అశక్తి పెంచేందుకు వాటర్ స్పోర్ట్స్ ఎంతో దోహదపడుతాయన్నారు. జెట్ స్కీయింగ్, బనానా రైడ్స్, కయాకింగ్ వంటి వాటర్ ప్పోర్ట్స్‌లో పాల్గొనడంతో పాటు పోటీలను విక్షించేందుకు సందర్శకలు భారీగా తరలిరావడం శుభపరిణామమన్నారు. చిరువ్యాపారస్తులకు ఇది ఒక మంచి అవకాశంగా మారిందన్నారు. వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి జిల్లాలో పర్యాటక రంగానికి మరింత ఊతం ఇవ్వనుందని అయితే పర్యావరణ పరిరక్షణ, నదీ నీటి కాలుష్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని వాటర్ స్పోర్ట్స్ కార్యకలాపాలను ప్రవేశపెట్టి, ఈ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కషి చేస్తామన్నారు. శాప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఎస్. భరణి మాట్లాడుతూ క్రీడాకారులు అందుబాటులో ఉన్న అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నదీ తీర ప్రాంతాలలో జల క్రీడలు నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులను అభివద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. జల క్రీడలలో రాష్ట్రాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు కషి చేస్తున్నామన్నారు. పోటీలలో 275 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగిందని క్రీడా కోర్చులు మేనేజర్లు విజయవంతంగా పోటీలను నిర్వహించడంలో భాగస్వామం కావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివద్ధి అధికారి కాకర్ల కోటేశ్వరరావు, కయాకింగ్ కనోయంగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బలరామ్‌నాయుడు, చైర్మన్ ప్రదీప్‌నాయుడు, జిల్లా అధ్యక్షుడు జగదీష్, కార్యదర్శి కనకరావు, రోయింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కాకాని తరుణ్, వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆదివాసి దినోత్సవం రోజున గిరిజన యువకుని జీవితంలో కొత్త వెలుగులు_

-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం -జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *