మహిళల ఆర్థిక స్వాలంభనకు స్వయం ఉపాధి కీలకం..

-రైజ్ శిక్షణ వర్క్‌షాప్‌ల ద్వారా మహిళలను పారిశ్రామిక వేత్తలను చేయాలన్నదే లక్ష్యం..
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల ఆర్థిక స్వాలంభన సుస్థిర భవిష్యత్తుకు స్వయం ఉపాధి మార్గాలు కీలక పాత్ర వహిస్తాయని రైజ్ సెంటర్ ద్వారా మహిళలకు చేతి వత్తులపై శిక్షణ ఉపాధి అవకాశాలపై వర్క్‌షాప్‌లను నిర్వహించి ప్రతి మహిళాలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిదేందుకు కషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
విజయవాడ రూరల్ మండలం గుంటుపల్లిలో ఏర్పాటు చేసిన రైజ్ శిక్షణ కేంద్రంలో సోలార్ పోటోవాల్‌టిక్ టెక్నిషన్ శిక్షణ పొందిన 28 మంది మహిళలకు టూల్ కిట్‌లు, సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం 50 మంది మహిళలకు తేనేటీగల పెంపకం పై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైజ్ సెంటర్ ద్వారా మహిళలు నేర్చుకున్న నైపుణ్యాలను ఉపాధిగా మార్చుకుని ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ, సహాయక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు అడుగులు వేయాలన్నారు. మహిళలు పొందుతున్న శిక్షణను కేవలం నేర్చుకోవడానికే పరిమితం కాకుండా, ఆచరణలోకి తీసుకువచ్చి ఆదాయ మార్గాలుగా మార్చుకోవాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంకు రుణాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలను వినియోగించుకుని పారిశ్రామిక, వ్యాపార యూనిట్లు ప్రారంభించాలన్నారు. మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు కృషిచేస్తున్న వాసవ్య మహిళా మండలి గోకుల్ ఎంటర్ ప్రైజెస్ సంస్థల ప్రతినిధులను అభినందిస్తున్నానన్నారు, మహిళలకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ట్యాంజోర్ పెయింటింగ్ శిక్షణ ఇచ్యేందుకు ముందుకు వచ్చిన శ్రీమతి ప్రతిభను ప్రత్యేకంగా దార్శినీకత ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నారు.
కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి కీర్తి, గోకుల్ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ శ్రీమతి వడ్డీ సంతోషిలక్ష్మీ, మహేష్, శ్రీమతి ప్రతిభ, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆదివాసి దినోత్సవం రోజున గిరిజన యువకుని జీవితంలో కొత్త వెలుగులు_

-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం -జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *