విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్య,ఉపాధి కల్పన కొరకు అనేక సామాజిక సేవ కార్యక్రమలు విస్తృతంగా చేపడుతున్నట్టు ట్రస్ట్ చైర్మన్, తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో 9వ డివిజన్, నిరుపేద కుటుంబనికి చెందిన రంగ ఆనంద్ వాళ్ళ కుమార్తె కాలేజీ ఫీజు నిమిత్తం డివిజన్ వైస్సార్సీపీ నాయకులు కన్నబాబు ఆధ్వర్యంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 15000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. భవిష్యత్తు లో ఉన్నత విద్య కు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Prajavartha Online Telugu News