Breaking News

జిల్లాలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల భవననిర్మాణాల పురోగతి వేగవంతం చెయ్యాలి… : కలెక్టరు జె. నివాస్

-అధికారులు నిర్థేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చెయ్యాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టు ను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం లాంచింగ్ చేయనున్నదని ఈలోగా బల్క్ మిల్క్ కూలింక్ కేంధ్ర భవనాలను పూర్తి చెయ్యాలని కలెక్టరు జె. నివాస్ అధికారులను ఆదేశించారు.
నగరంలోని జిల్లాకలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, ఆర్డీవోలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో వీసి ద్వారా కలెక్టరు జె. నివాస్ జాయింట్ కలెక్టర్లు శివశంకర్, మోహన్ కుమార్ లతో కలసి ఎన్ఆర్ఈజీఎస్ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల భవనాలను నిర్థేశించిన లక్ష్యాల మేరకు వేగవంతంగా నిర్మాణాలను పూర్తి చెయ్యాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రానున్న డిశెంబరు మాసం మొదటి లేదా రెండవ వారంలో జగనన్న పాలవెల్గువ ప్రాజెక్టును ప్రారంభించనున్నదన్నారు. ఈ మేరకు బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల భవనాలను ప్రభుత్వం నిర్థేశించిన నమూనాలను తప్పనిసరిగా పాటిస్తూ సకాలంలో పూర్తి చెయ్యాలని పంచాయితీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలోని తట్టివర్రు, చల్లపల్లి, గూడవల్లి, ఈలప్రోలు గ్రామాల్లో పూర్తి కావచ్చిన భవనాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. బియంసీయు భవన నిర్మాణాలకు స్థల సేకరణ గ్రామాలకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే తన దృష్టికి తేవాలని కలెక్టరు ఆదేశించారు. అదేవిధంగా పురోగతిలో ఉన్న గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. భవనాల నిర్మాణాల్లో ప్రతి వారం పురోగతిని సాధిస్తూ నిర్థేశించిన లక్ష్యాలను పూర్తిచెయ్యాలన్నారు. అందుకు విరుద్దంగా ఎవరైనా నిర్లక్షం వహిస్తే అటు వంటి అధికారులుపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టరు హెచ్చరించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు ఎల్. శివశంకర్, కె.మోహన్ కుమార్, పంచాయితీరాజ్ ఎస్.ఈ. వీరాస్వామి, ఐసీడిఎస్ పీడి కె. ఉమారాణి, నియోజక వర్గాల ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోవడం రాజకీయ పతనానికి నిదర్శనం

-16 వేలకుపైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిన లోకేష్‌ను చూసి ఓర్వలేక విషప్రచారం -ఐదేళ్లలో డీఎస్సీ ఇవ్వలేని జగన్‌.. ఇప్పుడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *