Breaking News

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17, 20 డివిజన్ల కి చెందిన ఇద్దరికీ వైద్య చికిత్స నిమిత్తం 50వెలు రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు కాగా శుక్రవారం తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామి రెడ్డి, సుబహాని, ఐతా కిషోర్, సొంగా రాజ కమల్  చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తంగిరాల రామి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షోభంలో కూడా నిరుపేదల సంక్షేమం కొరకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు అని, నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామి గా నిలిపిందెనుకు,ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ అవినాష్ కృషి చేస్తున్నారు అని, వారిరువురి నాయకత్వం లో పని చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నా సంకల్పం… నా దేశం కోసం!

– ఆగస్టు 10 నుంచి 15 వరకు “Partners in Nation Building – #AneNenu” కార్యక్రమం – స‌మాజంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *