లబ్ధిదారులతో గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసే విధంగా అవగాహన కల్పించండి…

-జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్

పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీల్లో చేపట్టనున్న ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా లబ్దిదారుల్లో అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ అధికారులకు చెప్పారు. పేదల కోసం నిర్మించనున్న ఇళ్ల నిర్మాణాల పురోగతిపై శుక్రవారం ఆమె తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణ పనులకు అవసరమైన స్టీల్‌, సిమెంట్‌, ఇసుక లబ్ధిదారులకుతక్షణమే అందిలన్నారు. ఇళ్లు నిర్మించనున్న ప్రాంతంలో విద్యుత్తు సౌకర్యం కల్పించామని చెప్పారు. లబ్ధిదారులు సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు వస్తున్నారని, చిన్నపాటి సమస్యలున్నా వాటిని త్వర గా పరిష్కరించాలని సూచనలు చేశారు. అనంతరం 3,4,5 వార్డుల సచివాలయాలను సందర్శించి ప్రభుత్వ పథకాలపై నోటీసు బోర్డుల్లో ప్రదర్శించిన సమాచారాన్ని పరిశీలీంచి అనంతరం రికార్డులు తనిఖీ చేశారు. వ్యాక్సిన్‌ ఎంతమందికి వేశారు. ఇంకా ఎంతమందికి వేయాలో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో జరుగుతున్నా ఓ.టి.ఎస్. సర్వే వేగవంతంగా కొనసాగించాలని ఆదేశించారు. ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా ఉద్యోగం నిర్వహిస్తూ బయోమెట్రిక్ పద్ధతిలో హాజరు నమోదు తప్పనిసరి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు తక్షణమే అందించడంతో పాటు వాళ్ల అభిప్రాయ సేకరణ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సురేష్బాబు ఎంపీడీవో వై రామకృష్ణ హౌసింగ్ డీఈ రమేష్ బాబుఏ ఇ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *