త్వరలో ఎపీఎస్ ఆర్టీసీ లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ కాలుష్యం తగ్గించి తద్వారా ప్రజలకు మేలైన రవాణా సౌకర్యం కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నందు 100 విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టడానికి రంగం సిద్దమైనది. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు మరియు తిరుపతి పట్టణములందు 350 విద్యుత్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) అంటే అద్దె ప్రాతిపదికన త్రిప్పుటకు ఉత్సాహమున్న బిడ్డర్ల వద్ద నుండి టెండర్లు పిలవడం జరిగినది. ఈ టెండర్ల ప్రక్రియ లో మొత్తం ముగ్గురు పాల్గొన్నప్పటికి ఇద్దరు అనగా మెస్సర్స్ ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్) హైద్రాబాదు మరియు మెస్సర్స్ అశోక్ లేలాండ్, చెన్నై వారు చివరి వరకు నిలిచారు. వారు ప్రతిపాదించిన రేటు చాలా ఎక్కువగా ఉండడంతో రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఆ తర్వాత సంప్రదింపులు కూడా చేయడం జరిగింది. కాగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు పట్టణాలలో 250 బస్సులకు అతి తక్కువగా కోట్ చేసిన (L1) వారు ప్రతిపాదించిన రేటు ఎక్కువగా ఉండటంతో అక్కడ ఈ ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహించే ఆలోచనను విరమించుకోవడం జరిగింది. ఇక తిరుపతి నుండి తిరుమలకు 50 బస్సులు మరియు తిరుపతి నుండి సమీప పట్టణాలైన కడప, నెల్లూరు, మదనపల్లి, రేణిగుంటలకు 50 బస్సులకు, L1 వారు ప్రతిపాదించిన రేటు కొంత తక్కువగా ఉన్నందున సుధీర్ఘంగా చర్చలు జరిపినా, రేటు ఇంద్ర డీజిల్ బస్సు రేటుతో సమానంగా ఉంటేనే ఈ కేటాయింపు ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పడంతో, మెస్సర్స్ ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (L1 ) దిగిరాక తప్పలేదు. చివరకు వారు ఇంద్ర డీజిల్ బస్సు రేటుతో ఎలక్ట్రిక్ బస్సులు త్రిప్పుటకు సమ్మతించడంతో వారి ప్రతిపాదనను అంగీకరించడం జరిగింది. అయితే ఈ స్కీములో భారత ప్రభుత్వం కొంత రాయితీ ఇవ్వవలసి ఉన్నందున 07 జూలై 2021 తేదీన వారి అనుమతి కొరకు పైలు పంపినప్పటికీ, అక్కడి నుండి రావలసిన ఆమోదము అలస్యమైనందున మెస్సర్స్ ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఎలక్ట్రిక్ బస్సులు ఇంకా రంగం లోకి దిగలేదు. తాజాగా, నిన్న భారత ప్రభుత్వం ఆర్టీసీ ప్రతిపాదనలను ఆమోదించడం జరిగింది. త్వరలో మెస్సర్స్ ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి అలాట్మెంట్ ఆర్దర్ ఇవ్వడం జరుగుతుంది. ఆపైన వారు బస్సులను తిరుపతి పట్టణం నుండి నిర్దేశించిన మార్గాలలో నడుపుతారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *