ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని విజయవాడ సబ్‌ కలెక్టర్‌ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ వైద్య అధికారులకు సిబ్బందికి సూచించారు. శుక్రవారం స్థానిక పాత ప్రభుత్వ ఆస్పత్రిని సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ ఆకస్మీక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపి రిజిస్టేషన్‌, వెయిటింగ్‌ హాల్‌, వాష్‌ఏరియా, గైనిక్‌ వార్డ్‌, స్కానింగ్‌ కేంద్రం,ప్రసవానంతర వార్డులను సబ్‌ కలెక్టర్‌ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులు, వారిసహాయకులు పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు. ఓపి రిజిస్టేషన్‌లో జాప్యం లేకుండా త్వరితగతిన రోగులకు వైద్యం అందేలా చూడాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *