విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అత్యంత ప్రేక్షకాదరణ గల కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ టి.ఎస్.విజయ్ చందర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే గుండె పోటుతో మరణించిన పునీత్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని ఆయన అన్నారు. కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్ తనయుడు పునీత్ రాజ్‌కుమార్ మరణం సినీ పరిశ్రమను తీవ్రంగా కలచివేసిందని విజయ్ చందర్ అన్నారు. 46 ఏళ్ల వయసుకే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ చాలా సౌమ్యుడుగా, అత్యంత గౌరవనీయ వ్యక్తిగా ఎంతో మంచి పేరున్న యువ హీరో అని, అటువంటి గొప్ప సినీ ప్రముఖుడిని కోల్పోవడం చాలా బాధాకరమని విజయ్ చందర్ ఆవేదన వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్నివ్యక్తం చేశారు.
Tags vijayawada
Check Also
లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ
-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …
Prajavartha Online Telugu News